Neem Hair Packs : వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్.. జుట్టుకు అద్భుత ప్రయోజనాలు-how to use neem hair packs to solve hair problems dandruff hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neem Hair Packs : వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్.. జుట్టుకు అద్భుత ప్రయోజనాలు

Neem Hair Packs : వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్.. జుట్టుకు అద్భుత ప్రయోజనాలు

Anand Sai HT Telugu Published Jan 03, 2024 12:30 PM IST
Anand Sai HT Telugu
Published Jan 03, 2024 12:30 PM IST

Neem Hair Pack : వేప ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు.

వేప ఆకులతో హెయిర్  ప్యాక్స్
వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్

ఈ కాలంలో జుట్టు సమస్యలు అనేకం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది జుట్టు రాలడం సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు చుండ్రు సమస్య కూడా ఎక్కువగానే ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వివిధ రకాల ఉత్పత్తులను వాడుతారు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి వివిధ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే ఇంట్లో తయారుచేసిన ప్యాక్‌లను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. వేప ఆకులు ప్రభావవంతగా పనిచేస్తాయి. వేప హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

వేప ఆకులు, పెరుగుతో ప్యాక్ తయారు చేయండి. కొన్ని ఆకులను కడిగి బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానితో పెరుగు కలపాలి. ప్యాక్ లా తయారు చేయండి. ఇప్పుడు ఈ ప్యాక్ ను స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది చుండ్రును పోగొట్టి జుట్టు మృదువుగా మారుతుంది.

వేప ఆకుల వల్ల చుండ్రు తొలగిపోతుంది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని మరిగేటప్పుడు వేప ఆకులను వేయాలి. 2 నిమిషాల తర్వాత వడకట్టాలి. ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు కాటన్ బాల్ తో ఆ నీటిని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 3 రోజులు ఇలా చేయండి.

వేప ఆకులు, తేనెతో ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొన్ని వేప ఆకులను తీసుకుని వాటిని మెత్తగా చేయాలి. ఇప్పుడు దానితో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. పొడి అయ్యాక కడగాలి. ఈ ప్యాక్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ప్రయోజనాలను పొందడానికి వారానికి 2 రోజులు ఉపయోగించండి. వేప ఆకుల వల్ల చుండ్రు తొలగిపోతుంది. అదేవిధంగా తేనె జుట్టుకు పోషణనిస్తుంది.

అలోవెరా జెల్, వేప ఆకులతో ప్యాక్ తయారు చేసుకోవచ్చు. కలబంద మొక్క ఆకులను కట్ చేసి జెల్ తీయండి. ఇప్పుడు ఆ జెల్‌తో వేప పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చివర్లు చీలిపోయే సమస్యను కూడా దూరం చేస్తుంది. చుండ్రు పోతుంది.

వేప ఆకులను కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు. ఒక గిన్నెలో కొన్ని వేప ఆకులను తీసుకుని వాటిని మెత్తగా చేయాలి. ఇప్పుడు దానితో కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

నిమ్మ, వేప ఆకులతో ప్యాక్ వేసుకోవచ్చు. కొన్ని వేప ఆకులను తీసుకుని మెత్తగా చేయాలి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఆలివ్ ఆయిల్, వేప ఆకులతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ముందుగా కొన్ని వేప ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి ఆలివ్ ఆయిల్ జోడించండి. బాగా కలపండి, ఒక ప్యాక్ చేయండి. ఈ మిశ్రమాన్ని తల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. ఆరిన తర్వాత, షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తొలగిస్తుంది. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది.

మెంతులు, వేప ఆకులతో ప్యాక్ తయారు చేసుకోవచ్చు. మెంతులను రాత్రంతా నానబెట్టండి. మెంతి గింజలను తీసుకోండి. మరోవైపు కొన్ని వేప ఆకులను తీసుకుని మెత్తగా చేయాలి. రెండు పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుండి జుట్టు వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. వారంలో 1 రోజు ఈ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు.

Whats_app_banner