Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..-pawan kalyan has an electric personality says og actress sriya reddy also responded on salaar 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..

Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 20, 2024 11:18 AM IST

Shriya Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్‍ గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు శ్రీయా రెడ్డి. ఆయనకు ఎలక్ట్రిక్ పర్సనాలిటీ ఉందని అని అన్నారు. ఓజీలో పవన్‍తో కలిసి పని చేసిన అనుభవాన్ని తెలిపారు. సలార్ 2 గురించి కూడా మాట్లాడారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..
Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..

సలార్ సినిమాలో తమిళ నటి శ్రీయారెడ్డి అదరగొట్టారు. పవర్ ఫుల్ పాత్రలో తన మార్క్ చూపించారు. దీంతో అప్పటి నుంచి ఆమెకు మళ్లీ సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంలోనూ శ్రీయారెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. తాను పాత్రలలో ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉన్నానని, ప్రస్తుతం ఓజీ మాత్రమే చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరుణంలో పవన్ కల్యాణ్‍తో పని చేసిన అనుభవం గురించి ఆమె వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయారెడ్డి మరిన్ని విషయాలు చెప్పారు.

ఓజీలో సలార్ కంటే భిన్నంగా..

ప్రస్తుతం తాను ఓజీ చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని శ్రీయా రెడ్డి వెల్లడించారు. కలరిపయట్టు అనే కేరళ మార్షియల్ ఆర్ట్ నేర్చుకుంటున్నట్టు వెల్లడించారు. త్వరలో మరిన్ని చిత్రాలు ఓకే చేస్తానని చెప్పారు. “ఓజీలో నా పాత్ర చాలా కూల్‍గా ఉంటుంది. సలార్‌తో పోలిస్తే డిఫరెంట్‍గా ఉంటుంది. సేమ్ యాక్టరేనా అనుకునేలా సాగుతుంది. నా కోసం సుజీత్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాశారు” అని శ్రీయా రెడ్డి అన్నారు. తన కెరీర్లో ఇది ఒకానొక బెస్ట్ రోల్‍గా ఉంటుందని చెప్పారు.

పవన్‍లో అట్రాక్ట్ చేసిన విషయాలు ఇవే

ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్‍తో కలిసి పని చేయడం గురించి శ్రీయా రెడ్డి స్పందించారు. పవన్‍కు ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ ఉందని అన్నారు. “పవన్ కల్యాణ్‍తో నేను చాలా సీన్లు షూటింగ్ చేశాను. ఆయన చాలా ఇంటెలిజెంట్. చాలా మంచి ప్రవర్తన, ఎంతో గౌరవంతో ఉంటారు. నాకు ఆయనలో ఆ విషయాలు బాగా ఆకర్షించాయి. ఆయనకు ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ ఉంది. ఆయన మాట్లాడే విధానంగా చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కొన్ని బ్యూటిఫుల్ సీన్లు ఉంటాయి. జనాలు వాటి గురించి ఏం మాట్లాడుకుంటారో చూడాలని ఉంది” అని శ్రీయా రెడ్డి తెలిపారు.

సలార్ 2 గురించి..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంలో రాధా రమా మన్నార్ పాత్ర చేశారు శ్రీయారెడ్డి. ఈ చిత్రంలో పురుషులను డామినేట్ చేసేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని తనకు ప్రశాంత్ నీల్ తొలుత చెప్పారని గుర్తు చేసుకున్నారు. సలార్ 2 కోసం ఏం కావాలో కూడా తనకు తెలుసునని చెప్పారు. “సీక్వెల్ కోసం రాధా ఫుల్ ఫోర్స్‌తో రావాలి. నేను ప్రశాంత్ నీల్‍తో కొన్ని విషయాల గురించి మాట్లాడా. ఏమైనా మార్చాలా.. మరింత బెటర్‌గా ఎలా చేయాలని అడిగా” అని శ్రీయా రెడ్డి తెలిపారు.

సలార్ సినిమా తర్వాత తనకు చాలా సినిమాల ఆఫర్లు వచ్చినా, ఆశ్చర్యపరిచేలా ఏవీ లేవని శ్రీయారెడ్డి తెలిపారు. తనకు గ్లామరస్ రోల్స్ కూడా వచ్చాయని వెల్లడించారు. అయితే తనకు ఏం చేయాలో క్లారిటీ ఉందని అన్నారు. డబ్బు కోసం, ఫేమ్ కోసం తాను ఏదైనా చేయాలని అనుకోవడం లేదని శ్రీయా స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం