Salaar team on Rumours: ఒక్క ఫొటోతో ఆ రూమర్లకు చెక్ పెట్టేసిన సలార్ 2 టీమ్!-salaar 2 shelved rumours team shared prabhas and director prashanth neel laughing photo salaar news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Team On Rumours: ఒక్క ఫొటోతో ఆ రూమర్లకు చెక్ పెట్టేసిన సలార్ 2 టీమ్!

Salaar team on Rumours: ఒక్క ఫొటోతో ఆ రూమర్లకు చెక్ పెట్టేసిన సలార్ 2 టీమ్!

Chatakonda Krishna Prakash HT Telugu
May 26, 2024 02:55 PM IST

Salaar 2 Rumours: సలార్ 2 సినిమాపై ఇటీవల రూమర్లు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం రద్దు అయిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ తరుణంలో సలార్ టీమ్ ఓ ఫొటో పోస్ట్ చేసింది.

Salaar 2: ఆ రూమర్లకు చెక్ పెట్టేసిన సలార్ 2 టీమ్!
Salaar 2: ఆ రూమర్లకు చెక్ పెట్టేసిన సలార్ 2 టీమ్!

Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్ సినిమా గతేడాది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ హైవోల్టేజ్ యాక్షన్‍, ప్రభాస్ సూపర్ పర్ఫార్మెన్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. సలార్‌కు సీక్వెల్‍గా ‘సలార్ 2: శౌర్యాంగపర్వం’ మూవీని కూడా టీమ్ ఖరారు చేసింది. క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండటంతో సలార్ 2పై మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ తరుణంలో ఇటీవల కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సలార్ 2 క్యాన్సిల్ కానుందనే ఊహాగానాలు బయటికి వచ్చాయి. ఇవి తీవ్రం అవుతున్న తరుణంలో సలార్ టీమ్ స్పందించింది.

నవ్వుతున్న ఫొటోతో..

సలార్ 2 మూవీ రద్దు అయిందని రూమర్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సలార్ టీమ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫొటోలను ట్వీట్ చేసింది. “వాళ్లు నవ్వు ఆపలేకపోతున్నారు” అని రాసుకొచ్చింది.

ఈ ఫొటోతో రూమర్లకు సలార్ టీమ్ దాదాపు చెక్ పెచ్చేసింది. సలార్ 2 క్యాన్సిల్ అయిందన్న రూమర్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఇన్‍డైరెక్ట్‌గా ఈ ఫొటోతో చెప్పినట్టయింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ నీల్ కూడా ఇటీవలే హింట్ ఇచ్చారు.

ఇటీవలే నీల్ ఏం చెప్పారంటే..

సలార్ 2 సినిమానే తన తదుపరి ప్రాజెక్ట్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ప్రభాస్ ఇతర సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలో ఆయన లేని సీన్లను ప్రశాంత్ ముందుగా చిత్రీకరిస్తారని టాక్ వచ్చింది. కల్కి 2898 ఏడీ ప్రమోషన్లు అయిపోయాక సలార్ 2 షూటింగ్‍కు ప్రభాస్ వస్తారనే అంచనాలు వచ్చాయి.

అయితే, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ గురించి ఇటీవలే అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని వెల్లడైంది. దీంతో సలార్ 2 రద్దయిందనే రూమర్లు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని, సలార్ 2 ఉంటుందనేలా ఇప్పుడు హింట్ ఇచ్చింది మూవీ టీమ్.

సలార్ 2 గురించి ప్రశాంత్ నీల్ మాత్రమే కాకుండా ఆ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా గతంలో మాట్లాడారు. షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని, 2025లో రిలీజ్ అవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మూవీలో నటిస్తున్న బాబి సింహా కూడా ఇలాంటి విషయమే చెప్పారు. అయినా కూడా సలార్ 2 రద్దయిందనే రూమర్లు రావడం కాస్త ఆశ్చర్యమే.

సలార్ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. రూ.600కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టిన్నూ ఆనంద్, శ్రీయారెడ్డి, బాబి సింహా కీలకపాత్రలు చేశారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024