Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు-director prashant neel says ready to go with salaar 2 and kgf 3 script already completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Chatakonda Krishna Prakash HT Telugu
May 08, 2024 04:15 PM IST

Prashanth Neel on Salaar 2, KGF 3: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదుపరి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తారన్న విషయంలో ఉత్కంఠ ఉంది. ఈ తరుణంలో సలార్ 2, కేజీఎఫ్3 సినిమాలపై తాజాగా ఆయన అప్‍డేట్ చెప్పారు.

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై  అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు
Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Prashanth Neel: కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ స్థాయికి నీల్ ఎదిగారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారు రూ.1,200కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ గతేడాది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రాల సీక్వెల్స్ సలార్ పార్ట్ 2, కేజీఎఫ్ 3 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ రెండు సినిమాల గురించి తాజాగా అప్‍డేట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

ముందు సలార్ 2

సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మూవీ షూటింగ్ త్వరలో మొదలవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. “సలార్ 2తో ముందుకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాం” అని ఆయన అన్నారు. దీంతో సలార్ 2నే తన ఇమీడియెట్ ప్రాజెక్ట్ అని క్లారిటీ ఇచ్చారు. మే నెలాఖరులోనే ఈ మూవీ చిత్రీకరణ షురూ అవుతుందని తెలుస్తోంది.

కేజీఎఫ్ 3 అప్పుడే..

కేజీఎఫ్ 3 స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని ప్రశాంత్ నీల్ చెప్పారు. “కేజీఎఫ్ 3 కచ్చితంగా జరుగుతుంది. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తయింది. అందుకే పార్ట్ 2లో తదుపరి భాగం గురించి చెప్పాం. యశ్‍కు ప్రస్తుతం వేరే సినిమాలు ఉన్నాయి. విజయ్ (హొంబాలే ఫిల్మ్స్)కు వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. కేజీఎఫ్ 3 లాంటి ప్రాజెక్టును వేరేవి చేస్తూ రూపొందించడం కష్టం. షెడ్యూల్స్ అన్నీ క్లియర్ అయినప్పుడే ప్రారంభిస్తాం” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

మరోవైపు, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తోనూ ప్రశాంత్ నీల్ ఓ మూవీ చేయనున్నారు. సలార్ 2 షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ - నీల్ మూవీ షూటింగ్ ఈ ఏడాది అఖర్లో షురూ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత కేజీఎఫ్ 3 మొదలయ్యే అవకాశం ఉంది. యశ్ చేతిలో ప్రస్తుతం టాక్సిక్‍‍తో పాటు రామాయణం సినిమాలు ఉన్నాయి. ఈ రెండు భారీ ప్రాజెక్టులే. ఇవి పూర్తయ్యాక కేజీఎఫ్ 3 మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఆలోగా ఎన్టీఆర్‌తో మూవీని నీల్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సలార్‌తో వేరే యూనివర్స్‌కు లింక్ ఉంటుందని పృథ్విరాజ్ సుకుమారన్ ఇటీవల చెప్పడంతో ఏ మూవీతోనో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

సలార్ 2 సినిమా షూటింగ్ మే నెలాఖరులో ప్రభాస్ లేకుండానే మొదలవుతుందని సమాచారం. జూలై నెలాఖరులో ప్రభాస్ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానుంది. అలాగే, మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా కూడా ప్రభాస్ లైనప్‍లో ఉంది. సలార్ 2, రాజాసాబ్ చిత్రాలను ఈ ఏడాది ఆఖరు కల్లా పూర్తి చేసుకోవాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను ఆయన చేయనున్నారు.