Salaar 2 Release: సలార్ 2 రిలీజ్ అప్పుడే! కీలక అప్‍డేట్ చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్-prithviraj sukumaran shares update about prabhas salaar 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 2 Release: సలార్ 2 రిలీజ్ అప్పుడే! కీలక అప్‍డేట్ చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్

Salaar 2 Release: సలార్ 2 రిలీజ్ అప్పుడే! కీలక అప్‍డేట్ చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 10, 2024 07:16 PM IST

Salaar 2 Release: సలార్ పార్ట్ 2 అప్‍డేట్ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ఓ విషయాన్ని వెల్లడించారు పృథ్విరాజ్ సుకుమారన్. ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందో తెలిపారు.

Salaar 2 Release: సలార్ 2 రిలీజ్ అప్పుడే! కీలక అప్‍డేట్ చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్
Salaar 2 Release: సలార్ 2 రిలీజ్ అప్పుడే! కీలక అప్‍డేట్ చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్

Salaar 2 Release: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సూపర్ హిట్‍గా నిలిచింది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర చేశారు. సలార్ సీక్వెల్ ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ అప్‍డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ రిలీజ్‍పై కీలక విషయం చెప్పారు. బడే మియా చోటే మియా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సలార్ 2 గురించి ఆయన స్పందించారు.

2025లో రిలీజ్

సలార్ పార్ట్ 2 సినిమా వచ్చే ఏడాది (2025)లో రిలీజ్ అవుతుందని పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కోసం ప్లాన్‍ను కూడా సిద్ధం చేసుకున్నారని వెల్లడించారు. “ప్రశాంత్ నీల్‍కు చాలా సామర్థ్యం ఉంది. షూటింగ్ పకడ్బందీగా ప్లాన్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. సలార్ 2లో కొన్ని సీక్వెన్సుల చిత్రీకరణ పూర్తి చేసేందుకు నేను ఎంపూరన్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. 2025లో సలార్ 2 కచ్చితంగా రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నా” అని పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పారు.

సలార్ పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సీన్లను పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే ప్రశాంత్ నీల్ చిత్రీకరించారని టాక్. మిగిలిన షూటింగ్‍ను వేగవంతంగా పూర్తి చేసేలా ఆయన పూర్తిగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2025 వేసవికి సలార్ పార్ట్ 2 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా అంచనాలు ఉన్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ కూడా 2025లోనే సలార్ 2 రిలీజ్ అవుతుందని అనుకుంటున్నానని, అయితే అది ప్రశాంత్ నీల్, హెంబాలే ఫిల్మ్స్ నిర్ణయిస్తారని తాజాగా అన్నారు. సలార్ 2 షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‍లోనే మొదలవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు బాబీ సింహా కూడా చెప్పారు.

సలార్ సినిమాలో దేవ పాత్రను ప్రభాస్ పోషించగా.. వరద రాజమన్నార్ పాత్రలో చేశారు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రాణ స్నేహితులైన వారిద్దరూ బద్ధశత్రువుగా మారిన తర్వాత ఏం జరిగిందన్నది సలార్ పార్ట్ 2లో ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవడంతో సీక్వెల్‍పై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో భారవ పాత్ర పోషించారు బాబి సింహా. శృతి హాసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, టిన్నూ ఆనంద్ కీరోల్స్ చేశారు.

ఇటీవలే ‘ఆడుజీవితం’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు పృథ్విరాజ్ సుకుమారన్. ఆ సర్వైవల్ థ్రిల్లర్ మూవీలో ఆయన నటనకు చాలా ప్రశంసలు దగ్గటంతో పాటు కమర్షియల్‍గానూ బాగా సక్సెస్ అయింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘బడే మియా చోటే మియా’ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ కానుంది.

ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే నెలలోనే విడుదల కానుంది. రాజాసాబ్, స్పిరిట్‍ కూడా ఆయన లైనప్‍లో ఉన్నాయి. వీటి మధ్యలోనే సలార్ 2 షూటింగ్‍ను ఆయన కంప్లీట్ చేసుకోనున్నారు. అలాగే, దర్శకుడు హను రాఘవపూడితోనూ ఓ చిత్రానికి ప్రభాస్ ఓకే చెప్పారు.

IPL_Entry_Point