Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ!-kalki 2898 ad animation prelude set to stream on ott platform before releasing film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Ott Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ!

Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2024 02:37 PM IST

Kalki 2898 AD OTT Versions: కల్కి 2898 ఏడీ సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యే ముందే ఓ రూపంలో ఓటీటీలో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలివే..

Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ! ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ
Kalki 2898 AD OTT Version: థియేటర్లలో రిలీజ్ కంటే ముందే ఆ రూపంలో ఓటీటీలోకి కల్కి 2898 ఏడీ! ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ

Kalki 2898 AD OTT: కల్కి 2898 ఏడీ సినిమాపై గ్లోబల్ రేంజ్‍లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ.. అత్యంత భారీ బడ్జెట్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రంగా కల్కిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మూవీని మే 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించనా.. ఇంకా సందిగ్ధత ఉంది. కాస్త వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్. అయితే, థియేటర్లలో విడుదల కంటే ముందే కల్కి మూవీ ప్రపంచాన్ని ప్రజలకు వివరించేందుకు మూవీ టీమ్ ఓ స్ట్రాటజీ ఫాలో కానుందని తెలుస్తోంది.

ఓటీటీలోకి యానిమేటెడ్ వెర్షన్

కల్కి 2898 ఏడీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకముందే.. ఓటీటీలో యానిమేటెడ్ రూపంలో ఓ వీడియోను తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. కల్కి సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఇది ఉంటుందని తెలుస్తోంది. దీనివల్ల మూవీకి మరింత హైప్ పెరగటంతో పాటు సినిమా థియేటర్లలో చూసే ముందే కల్కి ప్రపంచాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోగలుగుతారని టీమ్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే, ఈ యానిమేటెడ్ వెర్షన్ కోసం ఇంకా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను మూవీ టీమ్ ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఓవరాల్‍గా ఈ చిత్రం ఓటీటీ హక్కుల డీల్ కోసం చర్చలు జరుగుతున్నట్టు టాక్. అయితే, కల్కి మూవీ కోసం భారీ స్థాయిలో వెచ్చించేందుకు ఓటీటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.

కల్కి 2898 ఏడీ యానిమేషన్ వీడియోకు సంబంధించి డబ్బింగ్ పనులు జరగాల్సి ఉంది. హీరో ప్రభాస్ దీనికి డబ్బింగ్ చెప్పనున్నారని టాక్. కల్కి ప్రపంచాన్ని పరిచయం చేయడం, బ్యాక్‍డ్రాప్‍ను వివరించడమే యానిమేటెడ్ వెర్షన్ ఉద్దేశంగా ఉండనుందని టాక్.

ఆసక్తికరమైన స్ట్రాటజీ

కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి యానిమేషన్ రూపంలో వీడియో తీసుకురావాలనుకోవడం ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చిత్రంపై ఆసక్తిని, అంచనాలను మరింత పెంచే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కల్కి విషయంలో ఇది సక్సెస్ అయితే.. భవిష్యత్తులో కొన్ని భారీ బడ్జెట్ విషయాలు ఈ వ్యూహాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి.

రిలీజ్ ఆలస్యం!

మరోవైపు, కల్కి 2898 సినిమా మే 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న కారణంగా వాయిదా పడుతుందని రూమర్లు వస్తున్నాయి. మే 30వ తేదీకి ఈ చిత్రం రిలీజ్ వెళుతుందని టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు, ఈ చిత్రం టీజర్ త్వరలోనే రానుంది.

కల్కి 2898 ఏడీ సినిమా భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశాపటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point