Kamal Haasan: కల్కి 2898 ఏడీలో కమల్ హాసన్ విలన్ కాదట! పెద్ద బాంబ్ పేల్చిన లోక నాయకుడు
Kamal Haasan About Kalki Role: ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీలో ఇప్పటివరకు కమల్ హాసన్ విలన్ అని అనుకున్నారు. కానీ, ఆ సినిమాలో కమల్ హాసన్ విలన్ కాదట. కేవలం ఒక స్పెషల్ రోల్ మాత్రమే చేస్తున్నట్లు తాజాగా ఈ యూనివర్సల్ హీరో షాకింగ్ విషయం బయటపెట్టాడు.
Kamal Haasan About Kalki Role: ఫ్యూచరిస్టిక్ ఫాంటసీలోకి తీసుకువెళ్లేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా 'కల్కి 2898 ఏడీ'. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ సినిమాపై అంచనాలతోపాటు, ఎంతో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తోపాటు హాట్ బ్యూటి దిశా పటానీ వంటి స్టార్స్ యాక్టర్స్ కల్కిలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నట్లు ముందు నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా స్టార్‌కు లోక నాయకుడు విలన్ అంటే సినిమా ఊహించని రేంజ్‌లో ఉంటుందని అంతా భావించారు. కానీ, తాజాగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురి చేశాయి.
ఇటీవల ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. లోక నాయకుడు కమల్ హాసన్ కల్కి 2989 ఏడీ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. అందరు ఊహించినట్లుగా కల్కిలో ప్రతినాయకుడి పాత్ర చేయట్లేదని, సినిమాలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తున్నట్లు కమల్ హాసన్ స్పష్టం చేసినట్లు ది హిందూ పేర్కొంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. అందుకు కారణం ఇన్ని రోజులుగా కమల్ హాసన్ కల్కిలో మెయిన్ విలన్‌గా చేస్తున్నారని ఎంతో ఊహించుకోవడమే.
అయితే, కమల్ హాసన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్‌తో అభిమానులు, ఆడియెన్స్‌లో కొత్త డౌట్ మెదిలింది. మరి కమల్ హాసన్ విలన్‌గా చేయకుంటే.. అసలు విలన్ ఎవరు. ప్రభాస్‌కు మెయిన్ విలన్‌గా ఎవరు నటిస్తున్నారనే కొత్త ప్రశ్న తలెత్తింది. మరి వీటిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కానీ, వైజయంతీ మూవీస్ టీమ్ కానీ స్పందిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి, కమల్ హాసన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక కల్కి 2898 ఏడీ సినిమా అనేది మైథలాజికల్ పాత్రల ఇతివృత్తంతో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ. గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇది వరకు సినిమా గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఈ కల్కి సినిమా మహాభారత కాలం నుంచి స్టార్ట్ అయి 2898 ఏడీ వరకు మధ్య ఉన్న 6000 సంవత్సరాల కాలక్రమంలో సాగే కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ భైరవ అనే సూపర్ హీరో పాత్రను పోషిస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ తెలియజేశారు.
భైరవ గురించి చెబుతూ అతను భవిష్యత్తులో కాశీ నగరానికి చెందినవాడిగా వర్ణించారు. కాగా కల్కి సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్‌గా దీపికా పదుకొణే నటిస్తోంది. ఇటీవల ఇటలీలో ప్రభాస్, దిశా పటాని మధ్య రొమాంటిక్ సాంగ్‌ను మూవీ టీమ్ చిత్రీకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను దిశా పటానీ ఇంటర్నెట్ వేదికగా పంచుకుంది.
ఇదిలా ఉంటే, మొదటగా కల్కి మూవీని మే 9, 2024న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కారణంగా కల్కి విడుదల తేది వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ రిలీజ్ విషయంపై దర్శక నిర్మాతలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.