Kalki In Italy: కల్కి 2898 ఏడీ నుంచి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఇటలీలో ప్రభాస్ దిశా పటానీ.. కొత్త ఫొటో వైరల్-prabhas kalki 2898 ad song shooting with disha patani in italy photo goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Kalki 2898 Ad Song Shooting With Disha Patani In Italy Photo Goes Viral

Kalki In Italy: కల్కి 2898 ఏడీ నుంచి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఇటలీలో ప్రభాస్ దిశా పటానీ.. కొత్త ఫొటో వైరల్

Sanjiv Kumar HT Telugu
Mar 07, 2024 11:57 AM IST

Kalki 2898 AD Italy Song Shooting: తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా నుంచి మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కల్కి 2898 ఏడీ నుంచి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఇటలీలో ప్రభాస్ దిశా పటానీ.. కొత్త ఫొటో వైరల్
కల్కి 2898 ఏడీ నుంచి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఇటలీలో ప్రభాస్ దిశా పటానీ.. కొత్త ఫొటో వైరల్

Prabhas Disha Patani In Italy: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి 2898 AD. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.

అయితే, తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఆ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నారు. కాగా ఈ పాటలో ప్రభాస్, దిశా పటానీ మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా తన షూట్ ముగించుకుని వచ్చినట్లుగా బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. ఇక కల్కి మూవీ టీమ్ షేర్ చేసిన ఫొటోలో ప్రభాస్, దిశా పటానీతోపాటు నాగ్ అశ్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే, కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది.

ఇక వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్యకావ్యాన్ని అందించనుంది డార్లింగ్ ఫ్యాన్స్ గంపెండు ఆశలు పెట్టుకున్నారు. దాంతో కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే, ఇటీవల కల్కి సినిమా వాయిదా పడింది, పడనుంది అని తెగ రూమర్స్ వచ్చాయి. కానీ, వాటిలో ఎలాంటి నిజం లేదంటూ ప్రభాస్‌తో ఉన్న వీడియోను షేర్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది వైజయంతీ మూవీస్. ప్రభాస్ తన కాలును మ్యూజిక్‌కు మూవ్ చేస్తూ ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోకు టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమాలో హీరోయిన్స్‌గా దీపికా పదుకొణె, దిశా పటానీతోపాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలన్‌గా కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. వీరితోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ కూడా నటిస్తున్నారని టాక్ వస్తకోంది. పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌, కృపాచార్య పాత్రలో నాని కెమియో రోల్స్ చేస్తారని సమాచారం. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point