Prabhas Kalki 2898 AD Release Date: కల్కి 2898 ఏడీ రిలీజ్ ఆ రోజే.. అదిరిపోయిన అప్‌డేట్!-prabhas kalki 2898 ad release date vyjayanthi movies to release on their sentiment date says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Kalki 2898 Ad Release Date: కల్కి 2898 ఏడీ రిలీజ్ ఆ రోజే.. అదిరిపోయిన అప్‌డేట్!

Prabhas Kalki 2898 AD Release Date: కల్కి 2898 ఏడీ రిలీజ్ ఆ రోజే.. అదిరిపోయిన అప్‌డేట్!

Hari Prasad S HT Telugu
Jan 09, 2024 10:50 AM IST

Prabhas Kalki 2898 AD Release Date: ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. ఈ మూవీ వైజయంతీ మూవీస్ కు బాగా కలిసి వచ్చిన మే 9నే రిలీజ్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి.

కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్
కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్

Prabhas Kalki 2898 AD Release Date: ప్రభాస్ అభిమానులకు ఇది పండగలాంటి వార్తే. ఇప్పటికే సలార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు.. ఇప్పుడు అతని నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ రూపంలో మరో గుడ్ న్యూస్ వస్తోంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ కు బాగా కలిసి వచ్చిన మే 9వ తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ట్రాక్ టాలీవుడ్ తన రిపోర్టులో వెల్లడించింది.

మూడేళ్లుగా కల్కి 2898 ఏడీ మూవీ సాగుతూనే ఉంది. చాలా రోజుల పాటు ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ మూవీకి గతేడాది టైటిల్ పెట్టి.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికే మూవీ రిలీజ్ అవుతుందని మొదట భావించారు. కానీ గ్రాఫిక్స్ పనులు చాలా ఆలస్యం అవుతుండటంతో అది సాధ్యం కాలేదు.

కల్కి 2898 ఏడీ ఆ రోజే వస్తుందా?

అసలు 2024లో కల్కి 2898 ఏడీ రిలీజ్ కాదని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ తమకు కలిసొచ్చిన తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అశ్వినీదత్ కు చెందిన ఈ నిర్మాణ సంస్థకు మే 9వ తేదీ గతంలో బాగా కలిసి వచ్చింది. ఈ బ్యానర్ లో ఆ తేదీన రిలీజైన సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.

ఈ ట్రెండ్ 34 ఏళ్ల కిందట మొదలైంది. 1990, మే 9న రిలీజైన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టాలీవుడ్ చరిత్రలో ఓ మెగా హిట్ గా నిలిచిపోయింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.15 కోట్లు వసూలు చేసింది. చిరంజీవి కెరీర్లో ఇదొక మరుపురాని సినిమా అయింది. ఇక చాలా రోజుల తర్వాత వైజయంతీ మూవీస్ కు మరో హిట్ ఇచ్చిన మహానటి సినిమా కూడా అదే మే 9న రిలీజైంది.

కల్కి 2898 ఏడీ మూవీ
కల్కి 2898 ఏడీ మూవీ

దీంతో సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఎంతో రిస్క్ తీసుకొని చేస్తున్న కల్కి 2898 ఏడీ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేస్తే తమ పంట పండుతుందని వైజయంతీ మూవీస్ భావిస్తున్నట్లు సదరు రిపోర్ట్ వెల్లడించింది. అయితే అది సాధ్యమేనా అన్నది అనుమానంగా మారింది. ఈ మూవీ గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.

మరో 93 రోజుల్లో కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఈ మధ్యే బాంబే ఐఐటీలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పాడు. ఆ లెక్కన ఏప్రిల్ లో ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో సాధ్యమైనంత త్వరగా గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసి అదే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు మారుతితో కలిసి ప్రభాస్ చేస్తున్న మూవీ నుంచి కూడా సంక్రాంతికి అప్‌డేట్ రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్, ఇతర విషయాలు మేకర్స్ వెల్లడించనున్నారు. ఆ లెక్కన ప్రభాస్ ఫ్యాన్స్ కు వరుస సర్‌ప్రైజ్ లతో ఈ సంక్రాంతి మరింత స్పెషల్ గా మారనుంది.

Whats_app_banner