Deepika Padukone: తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. అధికారికంగా ప్రకటించిన బాలీవుడ్ జంట
Deepika Padukone Ranveer Singh Become Parents Soon: బాలీవుడ్ హాట్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఈ స్టార్ సెలబ్రిటీ జంట అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో దీపిక పదుకొణె ప్రెగ్నెంట్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Deepika Padukone Pregnancy Official: ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం (ఫిబ్రవరి 29) దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తాము తల్లిదండ్రులు కాబోతున్నారనే గుడ్ న్యూస్ అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులకు అధికారికంగా తెలియజేశారు. దీపికా పదుకొణే ప్రెగ్నెంట్ అని పోస్ట్‌లో చెప్పారు. 2024 సెప్టెంబర్‌లో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
అధికారిక ప్రకటన
రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొణె చేసిన పోస్టుకు అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. కాగా దీపికా ప్రస్తుతం రెండు నెలల గర్భిణీ అని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇటీవల వారి సన్నిహిత వర్గాలు మీడియా సంస్థకు 'ది వీక్'కు తెలిపాయి. తాజాగా ఈ జంట ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా దీపిక పదుకొణె ప్రెగ్నెన్సీ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
ఒక్కసారిగా వైరల్
లండన్‌లో జరిగిన 77వ బాఫ్టా రెడ్ కార్పెట్‌పై దీపిక పదుకొణె ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. మొదట చీరకట్టులో కనిపించిన దీపికా తర్వాత వదులుగా ఉండే ఔట్‌ఫిట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. అప్పుడు దీపికను చూసిన నెటిజన్స్ ఆమె ప్రెగ్నెన్సీతో ఉందని సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ప్రారంభించారు. దాంతో ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొణె దంపతులు స్వయంగా వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పారు.
స్థిరంగా ఉండాలి
ఇదిలా ఉంటే ఇదివరకు జనవరిలో వోగ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొణెకు పిల్లలను కనడంపై ప్రశ్న ఎదురైంది. "రణ్ వీర్, నేను పిల్లలను ప్రేమిస్తాం. సొంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం ఎదురు చూస్తున్నాం" అని దీపిక పదుకొణె తెలిపింది. అలాగే తన పెంపకం గురించి కూడా వ్యక్తపరిచింది దీపిక పదుకొణె. కీర్తి, డబ్బు ఉన్నప్పటికీ స్థిరంగా ఉండటానికి సంబంధించిన ప్రాముఖ్యతను చాలా గట్టిగా చెప్పింది దీపికా పదుకొణె.
అలాంటి విలువలను
"ఈ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు, డబ్బుతో మోసపోవడం చాలా సులభం. కానీ, ఇంట్లో నన్ను ఎవరూ సెలబ్రిటీలా ట్రీట్ చేయరు. నేను మొదట ఒక కుమార్తెను, ఒక సోదరిని. అది మారాలని నేను కోరుకోవడం లేదు. నా కుటుంబం నన్ను స్థిరంగా ఉంచుతుంది. రణ్ వీర్, నేను మా పిల్లలలో అదే విలువలను పెంపొందించాలని ఆశిస్తున్నాము" అని తాను తన పిల్లలను ఎలా పెంచాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది.
రొమాంటిక్ మూవీతో
ఇదిలా ఉంటే, గతేడాది నవంబర్‌లో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బెల్జియం టూర్ వెళ్లారు. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం గోలియోం కీ రాస్లీలా రామ్ లీలా సెట్స్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్న విషయం తెలిసిందే.
ప్రభాస్‌తో కలిసి
అనంతరం బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో దీపిక, రణ్ వీర్ కలిసి నటించారు. ఈ సినిమాలే వారి ప్రేమకు బాటలు వేశాయి. మొత్తానికి ఇద్దరూ దంపతులుగా మారి ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక ఇటీవల ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'కల్కి 2898 ఏడీ' అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో నటిస్తోంది.