Prabhas Name: ప్రభాస్ పేరులో మార్పు అంటూ వైరల్.. క్లారిటీ ఇదే!-prabhas name change news goes viral after raja saab first look but it is just a mistake ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Name: ప్రభాస్ పేరులో మార్పు అంటూ వైరల్.. క్లారిటీ ఇదే!

Prabhas Name: ప్రభాస్ పేరులో మార్పు అంటూ వైరల్.. క్లారిటీ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2024 02:18 PM IST

Prabhas Name - Raja Saab: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ ఫస్ట్ లుక్ నేడు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ టైటిల్‍తో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసింది టీమ్. అయితే, ఈ పోస్టర్ వచ్చాక ప్రభాస్ పేరులో మార్పు వచ్చిందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Prabhas Name: ప్రభాస్ పేరులో మార్పు అంటూ వైరల్.. క్లారిటీ ఇదే!
Prabhas Name: ప్రభాస్ పేరులో మార్పు అంటూ వైరల్.. క్లారిటీ ఇదే!

Prabhas Name - Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ అయ్యాయి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 15) డబుల్ ఫీస్ట్ వచ్చింది. ఈ చిత్రానికి ‘ది రాజాసాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేసింది మూవీ టీమ్. భీమవరంలో భారీ ఎల్‍ఈడీ కటౌట్ ద్వారా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. లుంగీలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.  డార్లింగ్ లుక్ సూపర్‌గా ఉంది. అయితే, ది రాజాసాబ్ లుక్ వచ్చాక ప్రభాస్ పేరుతో మార్పు జరిగిందనే విషయం చక్కర్లు కొడుతోంది.

రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ పేరు PRABHASS అని ఉంది. పేరు చివర్లో ఒక S అదనంగా ఉంది. దీంతో న్యూమరాలజీ ప్రకారం ప్రభాస్‍.. పేరులో మార్పులు చేసుకున్నారని సమాచారం చక్కర్లు కొట్టింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఈ విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చినట్టు రిపోర్టులు వచ్చాయి. అదనంగా S ఎందుకు యాడ్ అయిందో టీమ్ పేర్కొంది.

PRABHAS’S అని పోస్టర్ మీద ఉండాల్సింది పొరపాటున PRABHASS అని పడిందని మూవీ టీమ్ చెప్పినట్టు తెలుస్తోంది. అది ప్రింటింగ్ తప్పిదమని వెల్లడించింది. అపోస్ట్రఫీ (’) మిస్ అవడం వల్ల ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రభాస్ పేరులో ఎలాంటి మార్పు లేదని స్పష్టత వచ్చింది.

ప్రభాస్ - మారుతీ కాంబోలో రానున్న ది రాజాసాబ్ హారర్ కామెడీ రొమాంటిక్ మూవీగా ఉండనుందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వచ్చింది.

ది రాజాసాబ్ టైటిల్ వీడియోలో పంచె కట్టుతో గ్లామరస్ లుక్‍తో ప్రభాస్ అదిరిపోయారు. వెనుక టపాసులు పేలడం, కలర్ పేపర్స్ పడడం మొత్తంగా కలర్ ఫుల్‍గా ఉంది. సెలెబ్రేషన్‍లా ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీవీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో బాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది.

కాగా, రాజాసాబ్ మూవీ గురించి ఇప్పటి నుంచి ప్రతీ నెలా ఓ అప్‍డేట్ ఇస్తామని డైరెక్టర్ మారుతీ చెప్పారు. భీమవరంలో జరిగిన ఫస్ట్ లుక్ రివీల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందని అన్నారు.

ఇక, ప్రభాస్ హీరోగా నటించిన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇటీవలే వెల్లడైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ మే 9వ తేదీన రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‍తో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్‍ఎక్స్‌తో కల్కి తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కీలకపాత్రలు చేస్తున్నారు.

IPL_Entry_Point