Prabhas Kalki 2898 AD Release Date: అఫీషియల్.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఇదే-prabhas kalki 2898 ad release date officially announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Kalki 2898 Ad Release Date: అఫీషియల్.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఇదే

Prabhas Kalki 2898 AD Release Date: అఫీషియల్.. ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Jan 12, 2024 10:39 AM IST

Prabhas Kalki 2898 AD Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతిని నిజమైన పండగలా మారుస్తూ కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. శుక్రవారం (జనవరి 12) ఉదయం వాళ్లు ఈ విషయాన్ని వెల్లడించారు.

కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్
కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్

Prabhas Kalki 2898 AD Release Date: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఈ మూవీ ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది మే 9వ తేదీన రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ థియేటర్లలో అనౌన్స్ చేయడం విశేషం. సంక్రాంతి సినిమాలు ఆడుతున్న థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ది ఎండ్ బిగిన్స్ నౌ" అంటూ కల్కి 2898 ఏడీ రిలీజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్లోని 2898 నంబర్లు అటూ ఇటూ వెళ్తూ చివరికి 2024 దగ్గర ఆగిపోయాయి. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ పక్కనే మే 9వ తేదీ రిలీజ్ అంటూ సర్‌ప్రైజ్ చేశారు. వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన ఆ తేదీనే ఈ మూవీ రిలీజ్ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

6 వేల ఏళ్ల కిందటి ముగిసిన కథ

మే 9వ తేదీనే వైజయంతీ మూవీస్ కు అతిపెద్ద హిట్ ఇచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు రిలీజై పెద్ద హిట్ అయ్యాయి. దీంతో అదే రోజు రిలీజ్ చేయాలని నిర్మాత అశ్వినీదత్ భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఊహించినట్లే అదే రోజు కల్కి 2898 ఏడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “ఆరు వేల ఏళ్ల కిందట పూర్తయిన కథ మే 9, 2024 న ప్రారంభం కాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ.. మే 9వ తేదీతో తమకు ఉన్న అనుబంధాన్ని అశ్వినీ దత్ నెమరువేసుకున్నారు. "వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మే 9వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన తేదీ. ఐకానిక్ జగదేక వీరుడు అతిలోకి సుందరి నుంచి అవార్డ్ విన్నింగ్ మహానటి, మహర్షి లాంటి సినిమాలు ఇదే తేదీన రిలీజయ్యాయి. ఇప్పుడు కల్కి 2898 ఏడీ వస్తోంది" అని అశ్వినీదత్ అన్నాడు.

ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్లో చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈ మూవీ సర్‌ప్రైజ్ త్వరలోనే రానుందని.. అది మొదట చూసిన వాళ్లను తమను ట్యాగ్ చేసి ప్రపంచానికి ఆ సర్ ప్రైజ్ ఏంటో చెప్పాలంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఆ సర్‌ప్రైజ్ ఈ రిలీజ్ డేట్ తోపాటు టీజర్ లాంటిది ఏమైనా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ఈ మూవీలో నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు అతని నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ కూడా తెలియడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ప్రభాస్ డైరెక్టర్ మారుతితో చేస్తున్న మూవీ అప్డేట్ కూడా సంక్రాంతి సందర్భంగానే ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

WhatsApp channel