Salaar Part 2 Title: సలార్ పార్ట్-2కు పవర్‌ఫుల్ పేరు: వివరాలివే-salaar part 2 titled as shouryaanga parvam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Part 2 Title: సలార్ పార్ట్-2కు పవర్‌ఫుల్ పేరు: వివరాలివే

Salaar Part 2 Title: సలార్ పార్ట్-2కు పవర్‌ఫుల్ పేరు: వివరాలివే

Salaar Part 2 Title: సలార్ పార్ట్-2కు టైటిల్ ఖరారైంది. నేడు రిలీజ్ అయిన పార్ట్-1 చివర్లో ఈ పేరును మేకర్స్ రివీల్ చేశారు. ఆ వివరాలివే..

Salaar Part 2 Title: సలార్ పార్ట్-2కు పవర్‌ఫుల్ పేరు: వివరాలివే

Salaar Part 2 Title: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘సలార్ పార్ట్1: సీజ్‍ఫైర్’ మూవీ నేడు (డిసెంబర్ 22) రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. తొలి రోజు కలెక్షన్లు కూడా ఈ చిత్రానికి భారీగా రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, సలార్‌ రెండో పార్ట్ టైటిల్‍ను.. ఈ పార్ట్-1 చివర్లో మేకర్స్ రివీల్ చేశారు.

సలార్ తొలి భాగం ‘సలార్ పార్ట్1: సీజ్‍ఫైర్’ పేరుతో నేడు రిలీజ్ అయింది. ఇక, రెండో పార్ట్ పేరును ఈ సినిమా ఎండింగ్‍లో ప్రకటించింది మూవీ యూనిట్. సలార్ పార్ట్-2కు ‘శౌర్యాంగ పర్వం’ (Shouryaanga Parvam) అనే పేరు ఫిక్స్ అయింది. రెండో భాగానికి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో అభిమానుల్లో ఆ సినిమాపై హైప్ మరింత పెరిగింది.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంటోంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్‍కు తన రేంజ్ హిట్ సలార్‌తో ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఆ రేంజ్‍లోనే హైప్‍ను ఈ మూవీ నిలబెట్టుకుంది. ప్రభాస్ కటౌట్‍కు తగ్గట్టు ఇన్నాళ్లకు సరైన యాక్షన్ మూవీ తీశారంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍ను పొగిడేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

సలార్‌లో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శృతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, శ్రీయారెడ్డి, ఈశ్వరి రావు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతం అందించారు.

కాగా, సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం మూవీ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్.. తదుపరి జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత సలార్ పార్ట్-2 పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత కథనం