Yash: యశ్ సింప్లిసిటీకి సలాం అంటున్న నెటిజన్లు.. రాకీ భాయ్ ఏం చేశారంటే..-sandalwood news yash buys radhika pandit an ice candy in small shop netizes hailing kannada star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yash: యశ్ సింప్లిసిటీకి సలాం అంటున్న నెటిజన్లు.. రాకీ భాయ్ ఏం చేశారంటే..

Yash: యశ్ సింప్లిసిటీకి సలాం అంటున్న నెటిజన్లు.. రాకీ భాయ్ ఏం చేశారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 17, 2024 04:20 PM IST

Yash: కన్నడ స్టార్ హీరో యశ్ మరోసారి సింప్లిసిటీ చూపించారు. చిన్న షాప్‍కు వెళ్లి తన భార్యకు ఐస్ క్యాండీ కొనిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

Yash: యశ్ సింప్లిసిటీకి సలాం అంటున్న నెటిజన్లు.. రాకీ భాయ్ ఏం చేశారంటే..
Yash: యశ్ సింప్లిసిటీకి సలాం అంటున్న నెటిజన్లు.. రాకీ భాయ్ ఏం చేశారంటే..

Yash: కన్నడ స్టార్ హీరో యశ్‍కు ఫుల్ క్రేజ్ ఉంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో ఆయన పాన్ ఇండియా హీరో అయ్యారు. రాకీ భాయ్‍గా దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే, ఎంత స్టార్ డమ్ ఉన్నా యశ్ సింపుల్‍గా ఉండేదుకు ఇష్టపడతారు. ఆయన మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. యశ్ మాట్లాడిన కొన్ని మాటలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా యశ్ మరోసారి తన సింప్లిసిటీ ప్రదర్శించారు.

యశ్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని భక్తల్‍లో ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో తన భార్య రాధిక పండిట్‍కు ఐస్ క్యాండీ కొనిచ్చేందుకు రోడ్‍సైడ్ ఓ చిన్న షాప్‍కు వెళ్లారు యశ్. ఆమె అక్కడే కూర్చొని ఐస్ తిన్నారు.

యశ్ ఓ సాధారణ వ్యక్తిలా చిన్న కిరాణ షాప్‍కు వెళ్లి ఐస్ కొనుగోలు చేశారు. సిబ్బంది ఉన్నా స్వయంగా ఆయనే వెళ్లి సింప్లిసిటీ చాటారు. రాధిక కూడా అక్కడే ఐస్ తిన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యశ్, రాధిక పండిట్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యశ్ ఎంత పెద్ద స్టార్ అయినా.. ఒదిగే ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. సలాం యశ్ అంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా ఓ చిన్న కిరాణా షాప్‍లో యశ్ ఐస్ కొన్న ఫొటోలు వైరల్‍గా మారాయి.

కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా 2022లో బ్లాక్‍బాస్టర్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. ఫస్ట్ పార్ట్ తెచ్చిన హైప్‍తో బాలీవుడ్‍లోనూ భారీ వసూళ్లను సాధించింది. కేజీఎఫ్ చిత్రాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ పాపులర్ అయ్యారు.

టాక్సిక్ గురించి..

రెండేళ్ల గ్యాప్ తర్వాత.. టాక్సిక్ సినిమా చేస్తున్నారు యశ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. టాక్సిక్ ఫస్ట్ లుక్‍లో తలకు హ్యాట్, చేతిలో భారీ గన్ పట్టుకున్న యశ్ లుక్ అదిరిపోయింది. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

టాక్సిక్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‍స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. టాక్సిక్ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది.

ఇక, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం చిత్రంలో యశ్.. రావణుడి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు.

యశ్ భార్య రాధికా పండిట్ కూడా ప్రముఖ నటే. కన్నడలో 20కు పైగా చిత్రాలను ఆమె చేశారు. ఆమె చివరగా చేసిన మూవీ ఆదిలక్ష్మి పురాణ. రెండో సంతానం తర్వాత ఆమె సినిమాలు చేయడం లేదు. యశ్, రాధిక కలిసి ఓ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశారు.

IPL_Entry_Point