KGF 2 Record : ఈ విషయంలో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2
KGF New Record : కేజీఎఫ్ 2 మరో రికార్డును బద్దలు కొట్టింది. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ మేరకు బుక్ మై షో వివరాలను వెల్లడించింది.
KGF చాప్టర్-2.. 2022లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం మాత్రమే కాదు.., ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన BookMyShowలో అత్యధిక టిక్కెట్లను విక్రయించి.. సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టింది. సినిమాలు, ఈవెంట్లు, స్ట్రీమింగ్ కంటెంట్‌పై సంవత్సరాంత నివేదికను బుక్ మై షో రూపొందించింది. ఇందులో KGF 2 ఐదేళ్ల రికార్డును బద్దలు చేసినట్టుగా పేర్కొంది. ఈ ఏడాది అనేక ఇతర రికార్డులను నెలకొల్పింది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది.
BookMyShow 2022 అత్యుత్తమ వినోద ట్రెండ్లపై వార్షిక నివేదికను రూపొందించింది. యశ్(Yash) నటించిన కన్నడ చిత్రం KGF చాప్టర్ 2 ఆన్ లైన్ టికెట్లు(Online Tickets) 1.77 కోట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) బాహుబలి 2: ది కన్‌క్లూజన్(Bahubali 2) నెలకొల్పిన మార్కును కేజీఎఫ్ 2 బ్రేక్ చేసింది. ఇది కొత్త రికార్డు. KGF 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వారాంతాల్లో మాత్రమే మొత్తం టిక్కెట్లలో 34 శాతం విక్రయించారు.
ఆన్లైన్ బుకింగ్(Online Booking) విషయానికొస్తే.. భారతదేశంలో టిక్కెట్ విక్రయాలలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోజు ఏప్రిల్ 14వ తేదీ.. 21.4 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ రోజునే థియేటర్లలో KGF 2 రిలీజ్ అయింది. ఇది కూడా మరో రికార్డు. ఈ ఆన్ లైన్ ప్లాట్ఫామ్లో ఇతర ప్రముఖ చిత్రాలలైన RRR, ది కాశ్మీర్ ఫైల్స్, పొన్నియన్ సెల్వన్: ఐ, విక్రమ్, బ్రహ్మాస్త్రా పార్ట్ వన్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చిత్రాలు సైతం ఎక్కువ టికెట్లు అమ్ముడు అయ్యాయి.
సాధారణ సినిమా స్క్రీన్ల కంటే 3డి, ఐమాక్స్, 4డీఎక్స్ ను ఎక్స్ పీరియెన్స్ చేసే ప్రేక్షకుల్లో 116 శాతం పెరుగుదల కనిపించిందనేది నివేదికలో తెలిసింది. సినిమా(Cinema) హాళ్లకు వెళ్లి 'థియేట్రికల్ ఎక్స్పీరియన్స్'ని ఎంచుకోవాలని జనాలు కోరుకుంటున్నట్టుగా ఇది సూచిస్తుంది.