Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్: ప్రశాంత్ నీల్.. హీరో, హీరోయిన్ గురించి కూడా..-salaar filmmaker prashanth neel all time favorite director is upendra most liked actors amitabh bachchan sri devi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్: ప్రశాంత్ నీల్.. హీరో, హీరోయిన్ గురించి కూడా..

Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్: ప్రశాంత్ నీల్.. హీరో, హీరోయిన్ గురించి కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 04:56 PM IST

Prashanth Neel: తనకు ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. అలాగే, తనకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరో కూడా వెల్లడించారు. ఓ టీవీ ఛానెల్ ప్రోగ్రామ్‍లో ఆయన ఈ విషయాలు చెప్పారు.

Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్: ప్రశాంత్ నీల్
Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్: ప్రశాంత్ నీల్

Prashanth Neel: కేజీఎఫ్ సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ సంచలనం సృష్టించారు. కన్నడ సినీ పరిశ్రమ పేరును దేశవ్యాప్తంగా మారుమోగించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ బ్లాక్‍బాస్టర్ అయింది. అత్యధిక వసూళ్లు దక్కించుకున్న శాండల్‍వుడ్ మూవీగా రికార్డులకెక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా గత డిసెంబర్‌లో వచ్చి భారీ హిట్ అయింది. దీంతో పాన్ ఇండియా రేంజ్‍లో స్టార్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని ప్రశాంత్ పదిలం చేసుకున్నారు.

తాజాగా, ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో చెప్పాలని ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తన ఆల్‍ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ‘ఉపేంద్ర’ అని ప్రశాంత్ నీల్ సమాధానం ఇచ్చారు.

ష్!, తర్లే నాన్ మగ, ఓమ్ లాంటి సినిమాలు ప్రపంచంలో ఉపేంద్ర తప్ప మరెవరూ తెరకెక్కించలేరని, అందుకే ఆయనే తనకు ఇష్టమైన డైరెక్టర్ అని ప్రశాంత్ నీల్ చెప్పారు. “నా ఫేవరెట్ డైరెక్టర్ ఆల్‍టైమ్ అంటే ఉపేంద్ర సర్. కన్నడ ప్రోగ్రాం అని నేను ఇలా చెప్పడం లేదు. ప్రపంచంలో ఎవరైనా ష్!, తర్లే నాన్ మగ, ఓమ్ లాంటి చిత్రాలను ఒకరే తెరకెక్కించడం అసాధ్యం. ఆ సినిమాలు ఒకదానితో పోలిస్తే మరొకటి చాలా విభిన్నంగా ఉంటాయి. డిఫరెంట్ జానర్లలో ఉంటాయి. అవి తెరకెక్కించడం చాలా కష్టం. కానీ ఉపేంద్ర చేశారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఉపేంద్ర స్టోరీ టెల్లింగ్ రెవల్యూషనల్‍గా ఉంటుందని తెలిపారు.

ఇష్టమైన హీరో, హీరోయిన్

తనకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరో కూడా ప్రశాంత్ నీల్ వెల్లడించారు. తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అని తెలిపారు. శ్రీదేవి ఇష్టమైన హీరోయిన్ అని చెప్పారు.

ప్రశాంత్ నీల్ తదుపరి జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రభాస్‍తో సలార్ మూవీ సీక్వెల్‍ సలార్ 2: శౌర్యంగపర్వం చిత్రాన్ని రూపొందించనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు కూడా ప్రశాంత్ నీల్ ఓ స్టోరీ చెప్పారని తెలుస్తోంది.

నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర చాలా హిట్ సినిమాలు చేశారు. తన సినిమా కెరీర్లో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు. కొన్ని సినిమాల్లో స్వీయ దర్శకత్వంలో హీరోగానూ నటించారు. ఉపేంద్ర చేసిన కొన్ని సినిమాలపై విమర్శలు వచ్చినా .. సూపర్ హిట్ అయ్యాయి. ఉపేంద్ర స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్, టేకింగ్ డిఫరెంట్‍గా ఉంటాయి. ఇప్పటి వరకు 10 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన సుమారు 60 సినిమాల్లో నటించారు.

స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటిస్తున్న యూఐ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను జూన్‍లో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. ఇటీవలే వచ్చిన యూఐ ప్రోమో సాంగ్ పాపులర్ అయింది. యూఐ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. రేష్మ, సన్నీ లియోనీ, జిషు సెంగుప్త, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

IPL_Entry_Point