Salaar OTT Streaming: ఓటీటీలో సలార్ మూవీ స్ట్రీమింగ్‍.. ప్రభాస్ వీడియో రిలీజ్-salaar on netflix prabhas requests audience about his movie ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Ott Streaming: ఓటీటీలో సలార్ మూవీ స్ట్రీమింగ్‍.. ప్రభాస్ వీడియో రిలీజ్

Salaar OTT Streaming: ఓటీటీలో సలార్ మూవీ స్ట్రీమింగ్‍.. ప్రభాస్ వీడియో రిలీజ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2024 09:20 PM IST

Salaar OTT Streaming: సలార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజై నెల ముగియక ముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడిన వీడియో వచ్చింది.

Salaar OTT Streaming: ఓటీటీలో సలార్ మూవీ స్ట్రీమింగ్‍.. ప్రభాస్ వీడియో రిలీజ్
Salaar OTT Streaming: ఓటీటీలో సలార్ మూవీ స్ట్రీమింగ్‍.. ప్రభాస్ వీడియో రిలీజ్

Salaar OTT Streaming: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ బ్లాక్‍బాస్టర్ మూవీ ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. గత డిసెంబర్ 22వ తేదీన రిలీజైన ఈ పాన్ ఇండియా చిత్రం భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.700కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ తెరకెక్కింది. యాక్షన్‍తో ప్రభాస్ అదరగొట్టారు. కాగా, థియేటర్లలో రిలీజై నెల ముగియకుండానే సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (జనవరి 20) ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది.

సలార్ సినిమా నేడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సలార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ గురించి హీరో ప్రభాస్ మాట్లాడిన వీడియోను నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

“యాక్షన్ ఫ్లిక్స్ సలార్‌ను ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్‌లో చూడండి. ఎంజాయ్ చేయండి” అని ప్రభాస్ అన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ పోస్ట్ చేసింది. “దేవరత రైజర్ (ప్రభాస్) నుంచి ఓ అనౌన్స్‌మెంట్ ఉంది. ప్లీజ్.. వీ.. కైండ్లీ.. రిక్వెస్ట్.. ఆయన మాట వినండి. సలార్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

సలార్ చిత్రాన్ని అంచనాల కంటే ముందుగానే నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. అయితే, సలార్ హిందీ ఆడియోలో మాత్రం ఇంకా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రాలేదు. హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రానుందని తెలుస్తోంది. హిందీ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ మార్చిలో తీసుకొస్తుందని తెలుస్తోంది.

సలార్ సినిమాలో దేవాగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, దేవరాజ్, బాబి సింహా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. హెంబాలే ఫిల్మ్స్ నిర్మించింది.

సలార్ 2లో అఖిల్.. స్పందించిన దర్శకుడి భార్య

సలార్ సినిమా సీక్వెల్ శౌర్యాంగపర్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించనున్నారని ఇటీవల రూమర్స్ వచ్చాయి. సలార్ సక్సెస్ పార్టీకి అతడు హాజరు కావడంతో ఈ పుకార్లు వచ్చాయి. అయితే, ఇవి రూమర్లు మాత్రమేనని ప్రశాంత్ నీల్ భార్య లిఖిత వెల్లడించారు. సలార్ 2లో అఖిల్ నటించనున్నారా అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. అవి రూమర్లు మాత్రమేనని లిఖిత చెప్పారు.

ప్రభాస్ హీరోగా నటించిన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం మే 9వ తేదీన రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‍తో పాన్ వరల్డ్ రేంజ్‍లో ఈ మూవీ రూపొందింది.

తదుపరి మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా చేయనున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవల సంక్రాంతి సందర్భంగా వచ్చింది. పంచె కట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రం హారర్ కామెడీ జానర్‌లో ఉండనుందని తెలుస్తోంది.

IPL_Entry_Point