పురుషులలో వంధ్యత్వానికి రకరకాల కారణాలు ఉంటాయి.  సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వంగా పరిగణిస్తారు. ఇందులో పూర్తి వంధ్యత్వం, పాక్షిక వంధ్యత్వం ఉంటాయి

By Bolleddu Sarath Chandra
Dec 20, 2024

Hindustan Times
Telugu

పురుషుల్లో పూర్తి స్థాయి వంధ్యత్వం ఉన్న వారిలో మూల కారణాలను సరిచేసినా పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు

పాక్షిక వంధ్యత్వ లక్షణాలు ఉన్న వారిలో  కారణాలు సరిచేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి.

కొంతమంది మగవారిలో పుట్టుకతోనే బీజకోశంలోకి వృషణాలు దిగకుండా పొత్తికడుపులోనే ఉండిపోతాయి. దీనిని అన్‌డిసెంటెడ్‌ టెస్టిస్ అంటారు. ఇలాంటి వారిలో దాంపత్య జీవితం సాధారణంగానే ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. 

పుట్టుకతోనే కొందరిలో జననేంద్రియ వ్యవస్థలో లోపాల వల్ల వీర్య కణాల ప్రయాణం చేసే దారిలో అవరోధం ఏర్పడి వంధ్యత్వానికి దారి తీయొచ్చు. ఇలాంటి అవరోధాలను శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు. 

వృషణాల నుంచి రక్తాన్ని పైకి తీసుకువెళ్లే రక్తనాళాలు ఉబ్బి ఉండటాన్ని వెరికోసిల్ అంటారు. ఇలాంటి సమస్యల్ని శస్త్ర చికిత్సల ద్వారా సరిచేయవచ్చు. 

పురుషుల్లో కొందరికి మూత్ర  ద్వారం మొదట్లో చివర్లో కాకుండా మొదట్లో కానీ,  మధ్యలో కానీ ఉంటుంది. ఒకటికి మించి అసహజమైన మూత్ర ద్వారాలు ఉన్న పరిస్థితిని హైపోస్పోడియాస్ అంటారు. ఇలాంటి వారిలో వీర్యం మధ్యలోనే పడిపోవడం వల్ల స్త్రీ శరీరంలోకి వీర్యం ప్రవేశించే అవకాశం ఉండదు. దీనిని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చు. 

కొందరికి క్రోమోజోమ్స్‌లో తేడాల వల్ల వీర్యకణాలు తక్కువగా ఉ:న్నా, అసలు ఉత్పత్తి కాకపోవచ్చు. వంధ్యత్వానికి గురయ్యే వారిలో 10శాతం మందిలో ఇలా జరగొచ్చు. 

ఇంగ్వైనల్ హెర్నియా, హైడ్రోసిల్ వంటి ఆపరేషన్లు  జరిగిన వారిలో అరుదుగా వంధ్యత్వానికి దారి తీయొచ్చు. 

పురుషుల వృషణాల్లో క్షయ వ్యాధి వచ్చినా, ఫైలేరియా వ్యాధి సంక్రమించినా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. 

మూత్ర పిండాల వ్యాధులు దీర్ఘకాలంగా ఉన్నా, ప్రోస్టేట్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా, గనేరియా వంటి సుఖ వ్యాధులు ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. 

వీర్యం వచ్చే మార్గం మూసుకుపోయినా, చిన్నతనంలో గవద బిళ్లలు వచ్చి దాని వల్ల వృషణాలు దెబ్బతిన్నా  వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుంది.  కొలిమి వంటి వేడి ప్రదేశాల్లో పనిచేసే వారిలో స్థూలకాయుల్లో హార్మోనులు సరిగా తయారు కాక వంధ్యత్వం రావొచ్చు. 

గట్టిగా బిగించినట్టు ఉండే  అండర్‌ వేర్‌లు వాడటం వల్ల  వృషణాల్లో ఉష్ణోగ్రత పెరిగి వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. 

కండరాల పెరుగుదలకు సహకరించే 6 రకాల పండ్లు

Photo: Pexels