తెలుగు న్యూస్ / ఫోటో /
OTT: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన 7 సినిమాలు.. ఓటీటీ, కలెక్షన్స్, ఐఎమ్‌డీబీ రేటింగ్ వివరాలు.. ఆర్జీవీతోనూ!
Aishwarya Rai Abhishek Bachchan OTT Movies: బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి ఏడు సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని హిట్ కొట్టడమే కాకుండా ఓ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.
(1 / 8)
ఐశ్వర్యారాయ్, అభిషేక్ కలిసి ఏడు చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల పేర్లు, బాక్సాఫీస్ కలెక్షన్లు, ఐఎండీబీ రేటింగ్స్, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 8)
ఐశ్వర్య, అభిషేక్ కలిసి నటించిన మొదటి చిత్రం ధాయి అక్షర్ ప్రేమ్ కే 2000లో విడుదల అయింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కేవలం రూ.16 కోట్లు మాత్రమే వసూలు చేసి ఐఎండీబీలో 3.5 రేటింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
(3 / 8)
'ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' ఫ్లాప్ అయిన తర్వాత అభిషేక్, ఐశ్వర్య జంటగా నటించిన 'కుచ్ నా కహో' సినిమా రూ.12.56 కోట్లు రాబట్టి ఐఎండీబీలో 5.4 రేటింగ్ సాధించింది. కుచ్ నా కహో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్.
(4 / 8)
ఐశ్వర్య, అభిషేక్‌ల మూడవ చిత్రం 'ఉమ్రావ్ జాన్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .19.35 కోట్లు వసూలు చేసింది, ఐఎండిబిలో 5.4 రేటింగ్ అందుకుంది. ఈ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసి ఆనందించొచ్చు.
(5 / 8)
ఇక ఐశ్వర్య, అభిషేక్ నటించిన నాలుగో సినిమా ధూమ్ 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.147.90 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉంది. దీన్ని ధూమ్ 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షించవచ్చు.
(6 / 8)
2007లో విడుదలైన 'గురు' చిత్రాన్ని రూ.22 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 82.40 కోట్ల బిజినెస్ చేసింది. ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉన్న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
(7 / 8)
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ నటించిన 'సర్కార్ రాజ్' చిత్రం ఐఎండీబీలో 6.7 రేటింగ్ పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 57.95 కోట్లు వసూలు చేసింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన సర్కార్ రాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
ఇతర గ్యాలరీలు