Vettaiyan trailer: రజనీకాంత్ vs అమితాబ్ బచ్చన్.. వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది-vettaiyan trailer released rajinikanth amitabh bachchan face off in this action packed thriller movie trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vettaiyan Trailer: రజనీకాంత్ Vs అమితాబ్ బచ్చన్.. వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది

Vettaiyan trailer: రజనీకాంత్ vs అమితాబ్ బచ్చన్.. వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Oct 02, 2024 06:51 PM IST

Vettaiyan trailer: సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. సౌత్, నార్త్ కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు 33 ఏళ్ల తర్వాత ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నారు.

రజనీకాంత్ vs అమితాబ్ బచ్చన్.. వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది
రజనీకాంత్ vs అమితాబ్ బచ్చన్.. వేట్టయన్ ట్రైలర్ వచ్చేసింది

Vettaiyan trailer: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ వేట్టయన్ ది హంటర్. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ లాంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా నటించిన ఈ మూవీ ట్రైలర్ బుధవారం (అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అందుకునేట్లుగానే సాగింది.

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు సూపర్ స్టార్లు. ఇప్పుడీ ఇద్దరూ వేట్టయన్ మూవీ ద్వారా ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నారు. 33 ఏళ్ల తర్వాత ఈ స్టార్లు కలిసి నటించిన మూవీ ఈ వేట్టయన్. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ మొత్తం ఓ మహిళ హత్య చుట్టూనే తిరిగింది.

పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని రజనీకాంత్, అడ్వొకేట్ అయిన అమితాబ్ బచ్చన్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైట్ ను ఈ ట్రైలర్ లో చూడొచ్చు. సత్యదేవ్ అనే అడ్వొకేట్ పాత్రలో అమితాబ్ ఈ సినిమాలో నటించాడు. ఇక రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ ట్రైలర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. గతంలో అతడు జైలర్ మూవీకి అందించిన బీజీఎం ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడీ వేట్టయన్ కూడా అలాంటి సంచలనే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

అమితాబ్ రియాక్షన్ ఇదీ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వేట్టయన్ మూవీ ద్వారా తొలిసారి ఓ తమిళ మూవీలో నటించాడు. చాలా ఏళ్ల తర్వాత మరోసారి రజనీకాంత్ తో కలిసి నటించడంపై బిగ్ బీ ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించాడు. "తల ది గ్రేట్ రజనీతో మరోసారి కలిసి నటించడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అతడు ఏమీ మారలేదు. ఎంతో ఘనత సాధించినా.. ఇప్పటికీ చాలా సింపుల్ గా, ఓ సాధారణ స్నేహితుడిలాగే ఉన్నాడు" అని అమితాబ్ అన్నాడు.

అక్టోబర్ 10న దసరాకు రెండు రోజుల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లాల్ సలామ్ లో గెస్ట్ రోల్ తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ ఈ వేట్టయన్. అతని కెరీర్లో ఇది 170వ సినిమా. ఈ మూవీపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. జైలర్ రేంజ్ లో ఈ వేట్టయన్ కూడా రికార్డులు తిరగరాస్తుందన్న ఆశతో వాళ్లు ఉన్నారు.