Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున-chiranjeevi honoured with anr national award amitabh bachchan to give away the award akkineni nagarjuna announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున

Hari Prasad S HT Telugu
Sep 20, 2024 09:50 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ నేషనల్ అవార్డుతో సత్కరించాలని అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని శుక్రవారం (సెప్టెంబర్ 20) నాగార్జున అనౌన్స్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ఇవ్వనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డు వరించనుంది. అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నాగార్జున ఈ విషయాన్ని చెప్పాడు. ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అతని ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ ను కూడా రీరిలీజ్ చేయనున్నారు. నాగార్జునతోపాటు అక్కినేని కుటుంబం మొత్తం హాజరైన ఈ వేడుకలోనే అవార్డు విషయాన్ని వెల్లడించారు.

చిరంజీవికి అవార్డు ఇవ్వనున్న అమితాబ్

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ ఏఎన్నార్ నేషనల్ అవార్డును చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన సెలబ్రిటీలకు ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తున్నారు.

ఈ ఏడాది పద్మ విభూషణ్ అయిన మన మెగాస్టార్ కు ఇవ్వాలని ఫౌండేషన్ నిర్ణయించినట్లు అక్కినేని నాగార్జున చెప్పాడు. అక్టోబర్ 28న ఈ ఈవెంట్ జరగనుంది.

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాల్లోనే నాగ్ ఈ విషయం తెలిపాడు. "ఏఎన్నార్ అవార్డును ప్రతి ఏటా కాకపోయినా రెండేళ్లకోసారైనా ఇస్తున్నాం. ఈసారి ఈ అవార్డును చిరంజీవిగారికి ఇద్దామని నిర్ణయించాం. ఈ విషయాన్ని ఆయనకు చెప్పగానే చాలా ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పారు.

శతజయంతి సంవత్సరంలో ఈ అవార్డు తనకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు ఇవ్వాలని అమితాబ్ బచ్చన్ గారిని కోరగానే ఆయన కూడా వస్తానన్నారు. అక్టోబర్ 28న ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించాం" అని నాగార్జున చెప్పాడు.

ఆల్ టైమ్ గొప్ప నటుల్లో ఒకరు ఏఎన్నార్

అటు చిరంజీవి కూడా ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేశాడు. "ఆల్ టైమ్ గొప్ప నటుల్లో ఒకరైన లెజెండరీ ఏఎన్నార్ గారిని ఆయన 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఓ యాక్టింగ్ జీనియస్, సినిమా రంగంలో ప్రత్యేకమైన వ్యక్తి.

ఏఎన్నార్ గారి పర్ఫార్మెన్సెస్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు మరేదీ సాటిలేదు. మెకానిక్ అల్లుడు సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు దక్కింది. ఆ జ్ఞాపకాలను నేనెప్పుడూ మరచిపోలేను" అని చిరు ట్వీట్ చేశాడు.