Rajinikanth Hospitalised: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. సూపర్ స్టార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
Rajinikanth Hospitalised And His Health Condition: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం (సెప్టెంబర్ 30) అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రజనీకాంత్‌ను కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Rajinikanth Hospitalised: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం (సెప్టెంబర్ 30) నాడు అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రజనీకాంత్‌ను చేర్పించినట్లు సమాచారం. రజనీకాంత్‌కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
ఎలక్టివ్ ఆపరేషన్
73 ఏళ్ల రజనీకాంత్‌కు మంగళవారం (అక్టోబర్ 1) ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారట. అయితే, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంపై అటు రజినీకాంత్ కుటుంబం నుంచి కానీ, ఇటు ఆసుపత్రి నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్
అక్టోబర్ 10న వెట్టయాన్ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో రజనీకాంత్ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా కనిపించారు. వెట్టయాన్ సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి నటించగా.. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.