Vettaiyan Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్-rajinikanth vettaiyan prevue released telugu rana daggubati amitabh bachchan fahadh faasil vettaiyan the hunter prevue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vettaiyan Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్

Vettaiyan Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Sep 26, 2024 01:00 PM IST

Rajinikanth Amitabh Rana In Vettaiyan Prevue: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేట్టయన్ ప్రివ్యూను తెలుగులో విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ పవర్‌‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించారు. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ ఉన్న వేట్టయన్ ప్రివ్యూ అదిరిపోయింది.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్- విలన్‌గా రానా- అమితాబ్, ఫహాద్ ఫాజిల్‌తో వేట్టయన్ ప్రివ్యూ అదుర్స్

Rajinikanth Vettaiyan Prevue Released: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా వేట్టయన్ సినిమా అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానుంది.

వేట్టయన్ ప్రివ్యూ

సినిమా ప్రమోషన్స్ నేప‌థ్యంలో తాజాగా వెట్టైయాన్ ది హంటర్ చిత్రానికి సంబంధించి ప్రివ్యూ పేరుతో తెలుగులో వీడియోను విడుద‌ల చేసింది మూవీ యూనిట్. ఒక నిమిషం 38 సెకన్స్ ఉన్న ఈ వేట్టయన్ ప్రివ్యూ అదిరిపోయింది. ఇందులో పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, ఎస్పీ పాత్రలో రజనీకాంత్ కనిపించారు.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ సీనియ‌ర్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీస‌ర్స్ ఎవ‌రో మీకు తెలుసా! అని స‌త్య‌దేవ్ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) అడుగుతారు. వీళ్లు పేరు మోసిన ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీస‌ర్ స‌మాధానం చెబుతారు.

ఎన్‌కౌంటర్స్ చేయడంతో

‘ఈ దేశంలో ల‌క్ష‌లాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్ల‌ని మాత్రం చూడ‌గానే గుర్తుప‌డుతున్నారంటే!.. అదెలా సాధ్యం’ అని మ‌ళ్లీ సత్యదేవ్ ప్ర‌శ్న‌వేయ‌గా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మ‌రో లేడీ ఆఫీస‌ర్ (రితికా సింగ్) ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భ‌య‌ప‌డ‌కుండా ఎన్‌కౌంట‌ర్స్ చేయ‌టం వ‌ల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని స‌మాధానం చెబుతుంది.

మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌న క‌థానాయ‌కుడు వెట్టైయాన్ (ర‌జినీకాంత్‌) త‌న డ్యూటీలో ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా వ్య‌వ‌హ‌రించడం చూపించారు. ఎన్‌కౌంట‌ర్స్ ఎలా చేశార‌నే స‌న్నివేశాల‌ను చూపిస్తూ వ‌చ్చారు. ‘మ‌న‌కు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అని నేరస్థులు రజినీకాంత్ అంటే భయపడుతుంటారు.

ట్రాన్స్‌ఫర్ అవుతాడుగా

విల‌న్స్ వేట్ట‌య‌న్ పేరు చెబితేనే హ‌డ‌లిపోతుంటారు. డీల్ చేయ‌టానికి భ‌య‌ప‌డుతుంటారు. కానీ, ఓ రౌడీ మాత్రం "సిటీలో మర్డర్స్ జరిగితే ఆ ఎస్పీ ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతాడు కదా" అని అంటాడు. ఇక రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వెట్టైయాన్ వేటాడుతుంటాడని ప్రివ్యూ స‌న్నివేశాల్లో చూపిస్తూ వ‌చ్చారు.

అలాగే, ఇందులో ఫ‌హాద్ ఫాజిల్, దుసారా విజ‌య‌న్‌, ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అస‌లు వీళ్ల పాత్ర‌ల‌కు, వెట్టైయాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వెట్టైయాన్ జీవితంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌నేది సినిమా కథగా ఉండనుందని తెలుస్తోంది.

శిక్ష మాత్రమే కాదు

"ఎన్‌కౌంటర్స్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం హీరోయిజం కరెక్ట్.. అంతేనా" అని పోలీస్ ఆఫీసర్స్‌ను అమితాబ్ ప్రశ్నించడం చూపించారు. దానికి సమాధానంగా.. ఎన్‌కౌంటర్ అనేది నేరం చేసిన వాళ్లకు విధించే శిక్ష మాత్రమే కాదు. ఇక మీదట ఇలాంటి నేరం జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య" అని రజనీకాంత్ డైలాగ్‌తో ఎండ్ చేశారు. రజనీకాంత్‌ను అలాగే అమితాబ్ చూసే సీన్‌తో వేట్టయన్ ప్రివ్యూ ముగించారు.