Pushpa 2 Box Office Collection: చరిత్ర సృష్టించిన పుష్ప 2.. అత్యంత వేగంగా రూ.1500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీ
Pushpa 2 Box Office Collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను ఎడాపెడా బ్రేక్ చేస్తోంది. తాజాగా అత్యంత వేగంగా రూ.1500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. కేవలం 14 రోజుల్లోనే అల్లు అర్జున్ మూవీ ఈ మార్క్ అందుకోవడం విశేషం.
Pushpa 2 Box Office Collection: పుష్ప గాడి రూల్ మామూలుగా లేదు. అసలు ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రీతిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అత్యంత వేగంగా రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న ఈ అల్లు అర్జున్ మూవీ.. ఇప్పుడు రూ.1500 కోట్ల మార్క్ విషయంలోనూ అదే రిపీట్ చేసింది. కేవలం 14 రోజుల్లోనే ఈ మార్క్ అందుకొని రికార్డు క్రియేట్ చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది.
పుష్ప 2 @ రూ.1500 కోట్లు
పుష్ప 2 మూవీ 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ అకౌంట్లో తెలిపింది. గురువారం (డిసెంబర్ 19) రాత్రి వాళ్లు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను తెగ ఆనందానికి గురి చేస్తోంది. "బాక్సాఫీస్ దగ్గర హిస్టారిక్ రూల్ కొనసాగుతోంది. పుష్ప 2 ది రూల్ ఇప్పుడు అత్యంత వేగంగా రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ. 14 రోజుల్లోనే రూ.1508 కోట్లు వసూలు చేసింది." అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది.
కమర్షియల్ సినిమాకు అర్థం మార్చేసిన పుష్ప 2.. బాక్సాఫీస్ దగ్గర చరిత్రను తిరగరాసింది.. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్లు వసూలు చేసింది. ఈ మార్క్ అత్యంత వేగంగా అందుకున్న ఇండియన్ మూవీ అనే క్యాప్షన్ తో కాసేపటికే మరో ట్వీట్ కూడా చేసింది. తొలి మూడు రోజుల్లోనే రూ.600 కోట్ల గ్రాస్, ఐదు రోజుల్లో రూ.900 కోట్లు, తొలి వారంలోనే రూ.1000 కోట్లు అందుకున్న పుష్ప 2 మూవీ.. 14 రోజుల్లో రూ.1500 కోట్ల మార్క్ అందుకుంది.
బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 రూల్
డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైనప్పటి నుంచీ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రూ.100 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికే రూ.800 కోట్ల మార్క్ దాటేసింది. తెలుగు కంటే కూడా ఈ మూవీకి హిందీలోనే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ రూ.600 కోట్లకుపైగా నెట్ వసూళ్లు సాధించింది.
ఈ క్రమంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో స్త్రీ2 రికార్డును బ్రేక్ చేసింది. అది కూడా అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకోవడం విశేషం. ఇక ఇండియాలో తెలుగులో అయితే రూ.300 కోట్లకుపైనే వచ్చాయి.