CAT 2024 Result : క్యాట్ 2024లో ఇంజినీర్ల హవా! రిజల్ట్స్ విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
CAT 2024 Results : క్యాట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్ చేసుకోవాలి? క్యాట్ 2024 స్కోర్ ఎన్నేళ్ల వరకు వాలిడ్‌గా ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
క్యాట్ 2024 ఫలితాల్ని ఐఐఎం కోల్‌కతా విడుదల చేసింది. నవంబర్ 2024లో జరిగిన ఈ పరీక్షలో 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ని సాధించారు. అధికారిక వెబ్సైట్ imcat.ac.in లో ఐఐఎం క్యాట్ ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కామెన్ అడ్మిషన్ టెస్ట్) స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు.
క్యాట్ 2024 పరీక్షకు 3.29లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. 2.93లక్షల మంది ఎగ్జామ్‌కు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. కాగా మహిళల కన్నా పురుషులే ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాశారు. ఇక 100 పర్సెంటైల్ సాధించిన 14మందిలో 13మంది ఇంజినీరింగ్‌కి చెందిన వారే ఉన్నారు. మరోవైపు 29మంది 99.99 పర్సెంటైల్ని నమోదు చేశారు. వీరిలో 24మంది ఇంజినీర్లు, నలుగురు నాన్- ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ 29మందిలో 27 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక 30 మంది విద్యార్థులు 99.98 పర్సెంటైల్ని సాధించగలిగారు.
క్యాట్ ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
భారత్‌లో మేనేజ్మెంట్ విద్యలో అగ్రగామి ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024 ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
స్టెప్ 2:- వెబ్‌సైట్‌లోని హోం పేజ్‌లో క్యాట్ రిజల్ట్ 2024 లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- మీ లాగిన్ డీటైల్స్ని సమర్పించండి.
స్టెప్ 4:- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5:- మీ క్యాట్ 2024 ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
స్టెప్ 6:- తదుపరి అవసరాల కసం ఫలితాల్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోండి.
క్యాట్ 2024 నవంబర్ 24న ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడు సెషన్లలో జరిగింది. దేశవ్యాప్తంగా 170 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు
ఈ క్యాట్ 2024 స్కోర్ 2025 డిసెంబర్ 31 వరకు వాలిడ్‌గా ఉంటుంది.
నెక్ట్స్ ఏంటి..?
వివిధ ఐఐఎంలు క్యాట్ 2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం లెటర్లు పంపిస్తాయి. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాయి. ఐఐఎంలే కాదు 86 నాన్-ఐఐఎం వ్యవస్థలు సైతం మేనేజ్మెంట్ విద్య కోసం ఈ క్యాట్ ఫలితాలను ప్రమాణికంగా తీసుకుంటాయి.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు తరచూ క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండటం ఉత్తమం.
సంబంధిత కథనం