ఫార్ములా ఈరేసింగ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతి లేకుండానే… ఏసీబీ ఎలా కేసు నమోదు చేస్తుందని ప్రశ్నించారు. ఫార్ములా ఈరేసింగ్ లో ప్రభుత్వం కీలక విషయాలను దాచిపెట్టి… లీకులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం పెట్టిన కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎలక్ట్రిక్ పాలసీని మరింతగా ప్రమోట్ చేసే దిశగా ఫార్ములా ఈరేసింగ్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ఆటో మొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహనాలకు తెలంగాణను కేంద్రంగా మార్చాలని భావించామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈరేస్ కు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 25 అక్టోబర్ 2023లో ఒప్పందం చేసుకున్నామని… వరుసగా 4 సార్లు రేస్ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో ఒక ప్రమోటర్ ను భాగం చేయాలనుకున్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే… హైదరాబాద్ వేదికగా తొలి విడతగా ఈరేస్ నిర్ణయించామన్నారు. ఇది విజయవంతమైందని, చాలా మంది ప్రముఖలు కూడా వచ్చారని గుర్తు చేశారు.
సంబంధిత కథనం