Lucky Bhaskar Quotes: జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే పవర్‌ఫుల్ కొటేషన్స్!-the best 20 life changing quotes from lucky bhaskar movie dialogues telugu life lessons from lucky bhaskar ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Bhaskar Quotes: జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే పవర్‌ఫుల్ కొటేషన్స్!

Lucky Bhaskar Quotes: జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే పవర్‌ఫుల్ కొటేషన్స్!

Sanjiv Kumar HT Telugu

Life Lesson Quotes From Lucky Bhaskar Dialogues: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌తోపాటు ట్రెండింగ్‌లో ఉంది. లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ మోటివేషన్ ఇచ్చే కొటేషన్‌లా ఉన్నాయి. జీవితాన్ని మార్చే ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.

జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే పవర్‌ఫుల్ కొటేషన్స్!

Motivational Quotes From Lucky Bhaskar Dialogues: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి భార్యాభర్తలుగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది.

డబ్బు చుట్టూ

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లక్కీ భాస్కర్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా, నవంబర్ 28న ఓటీటీ రిలీజ్ తొలి రోజు నుంచే లక్కీ భాస్కర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ నేపథ్యంతో, డబ్బుకున్న విలువ, దాని చుట్టూ అల్లుకునే కుటుంబ బంధాలను ఎమోషనల్‌గా చూపించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశారు.

మోటివేషన్ ఇచ్చే 20 డైలాగ్స్

ఇక ప్రతి ఒక్కరి జీవితపాఠంగా ఉపయోగపడేలా డైలాగ్‌ను రాశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. జీవితాన్ని మార్చే మోటివేషన్ కొటేషన్‌లా ఉపయోగపడే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

డైలాగ్ 1

కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా

డైలాగ్ 2

ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు.

డైలాగ్ 3

బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి.

డైలాగ్ 4

థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు..

డైలాగ్ 5

కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను. అది కూడా తీసివ్వు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా.

డైలాగ్ 6

దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి.

డైలాగ్ 7

ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడలా?

డైలాగ్ 8

మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్..

కష్టం వస్తే.. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం..

అదే పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.

డైలాగ్ 9

అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..

డైలాగ్ 10

నెను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి.

డైలాగ్ 11

డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.

డైలాగ్ 12

ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా.. తప్పు లేదని.

డైలాగ్ 13

సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ..

డైలాగ్ 14

మాటల్లో ఇంత అహంకారం..

అహంకారం కాదు.. ధైర్యం

డైలాగ్ 15

చేతల్లో బలుపు..

బలుపు కాదు.. బలం

డైలాగ్ 16

ఇంత చెడ్డవాడిలా మారిపోతావ్ అనుకోలేదు

ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్

డైలాగ్ 17

జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు..

ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.

డైలాగ్ 18

వాడు కామన్ మ్యాన్..

అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు.

డైలాగ్ 19

వెల్‌కమ్ టు బొంబాయి.. ది మనీ కేపిటల్ ఆఫ్ ఇండియా

డైలాగ్ 20

దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం

ఇలా ఒక్కో డైలాగ్ జీవితంలో స్ఫూర్తినింపడానికి ఇచ్చే మోటివేషన్ కొటేషన్‌లా ఉన్నాయంటూ లక్కీ భాస్కర్ సినిమా చూసిన ఆడియెన్స్, నెటిజన్స్ చెబుతున్నారు. కాగా రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 107 నుంచి రూ. 111.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.