TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న సుహాస్ లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
Janaka Aithe Ganaka TV Premiere: జనక అయితే గనక చిత్రం టీవీలోకి అడుగుపెడుతోంది. టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఏ ఛానెల్‍లో, ఎప్పుడు ప్రసారం కానుందంటే..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది వరుసగా చిత్రాలు చేశారు. అందులో జనక అయితే గనక కూడా విభిన్నమైన స్టోరీతోనే వచ్చింది. కండోమ్ కంపెనీపై కేసు వేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. అక్టోబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు.. ఈ జనక అయితే గనక మూవీ ఇప్పుడు టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది.
టీవీ ప్రీమియర్ డేట్, టైమ్
జనక అయితే గనక సినిమా రేపు (డిసెంబర్ 22) సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మా టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని స్టార్ మా వెల్లడించింది. ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటలకు ఉంటుందని ప్రోమో తీసుకొచ్చింది.
జనక అయితే గనక చిత్రంలో సుహాస్‍కు జోడీగా సంగీర్తన విపిన్ నటించారు. పిల్లలు పుడితే ఖర్చు భరించలేనని భయపడే భర్త పాత్రను సుహాస్ చేశారు. భార్య నెల తప్పడంతో ఏకంగా కండోమ్ కంపెనీపై కేసు వేస్తారు. దీని చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు.
ఓటీటీలో ఎక్కడ..
జనక అయితే గనక చిత్రం నవంబర్ 8వ తేదీనే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కాయి. మరి స్టార్ మా ఛానెల్‍లో తొలిసారి ప్రసారంలో రేపు ఎలాంటి టీఆర్పీ దక్కించుంటుందో చూడాలి.
జనక అయితే గనక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‍రాజు నిర్మించడంతో మరింత బజ్ ఏర్పడింది. దిల్‍రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనతో పాటు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా ఈ చిత్రానికి ప్రొడ్యూజర్లుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి ప్రమోషన్లను గట్టిగానే చేసింది మూవీ టీమ్. దీంతో రిలీజ్‍కు ముందు మంచి బజ్ నెలకొంది. అయితే, మిక్స్డ్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.
జనక అయితే గనక చిత్రంలో సుహాస్, సంగీర్తనతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, కోర్టు సన్నివేశాలతో ఈ మూవీ సాగుతుంది. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు.