OTT Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సుహాస్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్-ott comedy movie janaka aithe ganaka suhas starrer 50 million streaming minutes in aha video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సుహాస్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్

OTT Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సుహాస్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్

Hari Prasad S HT Telugu

OTT Comedy Movie: ఓటీటీలో సుహాస్ నటించిన కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. డిజిటల్ ప్రీమియర్ కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకుపైగా స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇంతకీ మీరు ఈ మూవీ చూశారా లేదా?

ఓటీటీలో దుమ్ము రేపుతున్న సుహాస్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్

OTT Comedy Movie: టాలీవుడ్ యువ హీరో సుహాస్ నటించిన మూవీస్ మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చేసింది. చిన్న బడ్జెట్ సినిమాలే అయినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తుంటాయి. ఆ తర్వాత ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. అలా తాజాగా ఓటీటీలోకి వచ్చిన మరో కామెడీ మూవీ జనక అయితే గనక.

ఆహా అనిపిస్తున్న జనక అయితే గనక

సుహాస్ నటించిన జనక అయితే గనక గత శుక్రవారం (నవంబర్ 8) ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతకు ఒక రోజు ముందే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. మొత్తానికి మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.

దసరా సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అప్పట్లో పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోయినా.. ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే ముందు, వచ్చిన తర్వాత సుహాస్, ఈ మూవీ ఫిమేల్ లీడ్ సంగీర్తన సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్లతో చేసిన స్పెషల్ వీడియోలను ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

తాజాగా జనక అయితే గనక మూవీ 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకున్న సందర్భంగా కూడా వీళ్లు ఓ స్పెషట్ వీడియో రిలీజ్ చేశారు. సుహాస్ కూర్చొని ఏవో లెక్కలేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సంగీర్తన అక్కడికి వస్తుంది. మళ్లీ ఏం న్యూస్ తీసుకొచ్చావ్ అని సుహాస్ భయపడుతుండగా.. గుడ్ న్యూసేలే.. జనక అయితే గనక 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ అందుకుందని చెబుతుంది.

జనక అయితే గనక మూవీ గురించి..

జనక అయితే గనక ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన బోల్డ్ కామెడీ మూవీ. ఖర్చులకు భయపడి పెళ్లి తర్వాత కూడా కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకొనే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. పిల్లలు వద్దనుకొని జాగ్రత్తలు తీసుకున్న ఓ రోజు అతని భార్య ప్రెగ్నెంట్ అవుతుంది.

అయితే దీనికి కారణం కండోమ్ అని తెలుసుకున్న అతడు.. ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఈ కోర్టు రూమ్ డ్రామా సరదాగా సాగిపోతుంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న జనక అయితే గనక మూవీని మీరు కూడా ఆహా ఓటీటీలో చూసేయండి.