OTT Comedy Movie: అనుకోకుండా తండ్రి అయితే.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. వాళ్లకు మాత్రమే
OTT Comedy Movie: ఓటీటీలోకి ఒక రోజు ముందే ఓ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. యువ హీరో సుహాస్ నటించిన ఈ సినిమా అనుకోకుండా తండ్రి అయి దానికి కారణమైన కండోమ్ కంపెనీపై కేసు వేసే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
OTT Comedy Movie: టాలీవుడ్ యువ హీరో సుహాస్ నటించిన బోల్డ్ కామెడీ మూవీ జనక అయితే గనక. గత నెల 12న దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అంతేకాదు చెప్పిన తేదీ కంటే 24 గంట ముందే ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. అయితే ఈ సినిమాను ఇప్పుడే అందరూ చూసే అవకాశం మాత్రం లేదు.
జనక అయితే గనక ఓటీటీ స్ట్రీమింగ్
సుహాస్, సంగీర్తన నటించిన జనక అయితే గనక మూవీ ఆహా వీడియో ఓటీటీలో గురువారం (నవంబర్ 7) నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ మూవీ శుక్రవారం నుంచి రావాల్సి ఉన్నా.. ఆహా గోల్డ్ (Aha Gold) సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రం 24 గంటలు ముందుగానే అందుబాటులోకి రావడం విశేషం.
ప్రస్తుతానికి వాళ్లు మాత్రమే ఈ సినిమాను చూడగలరు. మిగిలిన సబ్‌స్క్రైబర్లు మాత్రం శుక్రవారం వరకు ఆగాల్సిందే. "మిడిల్ క్లాస్ గోల్డెన్ టిప్స్ కావాలా? అయితే జనక అయితే గనక చూసేయండి.. కేవలం ఆహా గోల్డ్ లో మాత్రమే" అనే క్యాప్షన్ తో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ మొదలైందన్న విషయాన్ని ఆహా ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఈ సందర్భంగా పోస్ట్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగా ఉంది. అందులో ఓవైపు భార్య తాను తల్లి కాబోతున్నానని తెలిసి సంతోషంగా కనిపిస్తుండగా.. మరోవైపు భర్త మాత్రం ఖర్చయ్యే డబ్బు కోసం టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.
జనక అయితే గనక స్టోరీ ఇదీ
జనక అయితే గనక మూవీ గత నెల 12న థియేటర్లలో రిలీజైంది. ఇదొక బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ. జీవితంలో పూర్తిగా సెటిలవక ముందే పెళ్లి చేసుకున్న యువకుడు.. అప్పుడే పిల్లలు వద్దనుకుంటాడు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంటాడు. కానీ అనుకోకుండా ఓ రోజు అతడు తండ్రయిన విషయం తెలిసి షాకవుతాడు.
దీనికి కారణం కండోమ్ చినిగిపోవడమే అని తెలుసుకొని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ తర్వాత కథ కోర్టుకు వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది? హీరోకి న్యాయం జరుగుతుందా? లేదా అన్నది ఈ జనక అయితే గనక మూవీ చూస్తే తెలుస్తుంది. మీకు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఇప్పుడే ఈ మూవీ చూసే వీలు ఉంటుంది.
ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్
ఆహా వీడియో ఓటీటీ ఆహా గోల్డ్ పేరుతో ఓ సబ్‌స్క్రిప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఏడాదికి రూ.999 చెల్లిస్తే ఆహా తెలుగు, తమిళంలోని అన్ని మూవీస్, వెబ్ సిరీస్ లను 4కే క్వాలిటీతో చూసే అవకాశం ఉంటుంది. యాడ్స్ గోల కూడా ఉండదు.
పైగా ఇలా అన్ని సినిమాలను 24 గంటల ముందే చూసే వీలు కూడా కల్పించారు. ఇది కాకుండా ఏడాదికి రూ.699 తో మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో కేవలం తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లను ఫుల్ హెడ్‌డీ క్వాలిటీతో చూడొచ్చు. యాడ్స్ ఉండవు. ఇవే కాకుండా మూడు నెలలకు రూ.199, మూడు నెలలకు రూ.99, ఏడాదికి రూ.399 ప్లాన్స్ కూడా ఉన్నాయి.