Sunscreen Protection in Winter: శీతాకాలంలోనూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలా? స్కిన్ స్పెషలిస్టులు ఏమంటున్నారు?-should you apply sunscreen in winter skin specialists advice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunscreen Protection In Winter: శీతాకాలంలోనూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలా? స్కిన్ స్పెషలిస్టులు ఏమంటున్నారు?

Sunscreen Protection in Winter: శీతాకాలంలోనూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలా? స్కిన్ స్పెషలిస్టులు ఏమంటున్నారు?

Ramya Sri Marka HT Telugu
Dec 21, 2024 08:30 AM IST

Sunscreen Protection in Winter: సూర్య కిరణాలు చలికాలంలో తక్కువ ప్రభావం చూపిస్తాయని అంతా అనుకుంటుంటారు. సన్‌స్క్రీన్ లోషన్ అవసర్లేదని పక్కకుపెట్టేస్తారు. అసలు ప్రశ్నేమిటంటే, నిజంగానే చలికాలం ఈ లోషన్లకు దూరంగా ఉండొచ్చా.. లేదా తప్పకుండా వాడాలా?

చలికాలంలోనూ సన్‌స్క్రీన్‌లు రాసుకోవాలా?
చలికాలంలోనూ సన్‌స్క్రీన్‌లు రాసుకోవాలా? (freepik)

వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఎండలో గడపడాన్ని ఇష్టపడని వారెవరుంటారు? చలికి వెచ్చదనం దొరికితే కలిగే ఉపశమనం హాయిగా అనిపిస్తుంది. ఇక అలాంటి సమయంలో ఎండ ఇంకా కావాలనిపించి సన్‌స్క్రీన్ లోషన్‌ను పట్టించుకోం. వాస్తవానికి ఇలా చేయడం కరెక్టేనా.. సాధారణంగా ప్రతిరోజూ రాసుకునే సన్ స్క్రీన్ లోషన్ ను చలికాలంలో రాసుకోకుండా ఉండటం మంచిదేనా..? చర్మవాధి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి.

ఏ కాలమైనా తీవ్రత ఒకటే:

చల్లని వాతావరణంలో ఉండేవారు ఎండ కాస్త పడగానే తమకు వెచ్చదనం కలిగిందని, వాతావరణంలోని చలికి, సూర్యకిరణాలు తగలడం వల్ల సమమైపోయిందని భావిస్తారు. కానీ, అది ముమ్మాటికి కరెక్ట్ నిర్ణయం కాదట. సూర్యుని అతినీలలోహిత లేదా యూవీ కిరణాలు శరీరం మీద పడి చర్మాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదట. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు ఎండకాలమైనా, శీతాకాలమైన ఒకే తీవ్రతను కలిగి ఉంటాయట. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకపోవడం వల్ల అవి నేరుగా శరీరం మీద పడి చర్మాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.

యూవీ కిరణాల నుంచి కాపాడుకోవాలంటే:

అంతేకాకుండా ముడతలు, పిగ్మంటేషన్, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్లు రక్షిస్తాయట. సన్ స్క్రీన్ లోషన్లు మన చర్మానికి యూవీ-ఏ, యూవీ-బీ కిరణాల నుంచి పూర్తి రక్షణను అందిస్తాయి. అంతేకాకుండా చర్మానికి వృద్ధాప్య ఛాయలు వెంటనే కలుగకుండా కూడా కాపాడతాయట. అందుకే చలికాలం వాతావరణంలో ఉండే వేడికి లోషన్లు అవసరం లేదనే భావన తీసిపారేయాలి.

కనీసం రెండు సార్లు:

పగటిపూట బయటకు వెళ్తుంటే కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కేవలం ముఖంపైనే కాకుండా మొత్తం శరీరంపై ముఖ్యంగా ఎండపడే భాగాలైన చేతులు, మెడ, చెవులపై కూడా రాసుకోవాలి. శీతాకాలమైనా, ఎండాకాలమైనా ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇది మీ చర్మాన్ని రక్షించడానికి, కాంతివంతంగా మార్చడానికి సులువైన, ప్రభావవంతమైన మార్గం. దాంతోపాటుగా రోజులో ఒక్కసారి మాత్రమే కాకుండా కనీసం రెండు సార్లైనా ఈ లోషన్ రాసుకోవడం ఉత్తమం. రెండు సార్లు అంటే మూడు నాలుగు గంటల గ్యాప్ లో రాసుకునేలా గుర్తుంచుకోండి.

చలికాలంలో చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. సన్ స్క్రీన్ లోషన్ యూవీ కిరణాలైన యూవీ-ఏ, యూవీ-బీ వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది.

2. చర్మం పొడిబారడం, తేమను కోల్పోవడం వంటి సమస్యల నుంచి కాపాడి కాంతివంతంగా మారుస్తుంది.

3. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది.

4. సూర్య రశ్మి వల్ల కలిగే సహజ మార్పులకు చర్మాన్ని గురికానివ్వదు. యాంటీ ఏజింగ్ క్రీమ్ గా పనిచేసి అకాల వృద్ధాప్యం సంభవించకుండా కాపాడుతుంది.

5. రెగ్యూలర్ స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల పిగ్మంటేషన్ అవకాశాలు తగ్గించి స్కిన్ టోన్ నార్మల్‌గా ఉండేలా చేస్తుంది.

6. చర్మాన్ని సమర్థవంతంగా రిపేర్ చేసి పాడైపోయిన కణ భాగాలను పునరుత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం