Skin Care: మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిపించే పాలు, బ్రెడ్ మిశ్రమం: ఎలా తయారు చేసుకోవాలి?-milk bread face pack making and face skin benefits acne reduction to glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care: మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిపించే పాలు, బ్రెడ్ మిశ్రమం: ఎలా తయారు చేసుకోవాలి?

Skin Care: మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిపించే పాలు, బ్రెడ్ మిశ్రమం: ఎలా తయారు చేసుకోవాలి?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 11, 2024 02:00 PM IST

Skin Care - Face Pack: చర్మం కోసం పాలు, బ్రెడ్‍తో ఫేస్‍ప్యాక్ తయారు చేసుకోవచ్చు. సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ ఫేస్‍ప్యాక్ ఎలా చేసుకొని వాడాలో ఇక్కడ చూడండి.

Skin Care: మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిపించే పాలు, బ్రెడ్ మిశ్రమం: ఎలా తయారు చేసుకోవాలి?
Skin Care: మొటిమలు తగ్గించి చర్మాన్ని మెరిపించే పాలు, బ్రెడ్ మిశ్రమం: ఎలా తయారు చేసుకోవాలి?

చర్మం కోసం వివిధ రకాల ఫేస్‍ప్యాక్‍లు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొన్నింటికి  కాస్త ప్రాసెస్, పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సింపుల్‍గా పాలు, బ్రెడ్‍తోనే ఓ ఫేస్‍ప్యాక్ తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా ప్యాక్ ముఖానికి వాడడం వల్ల చర్మం మెరుపు పెరగటంతో మొటిమలు, మచ్చలు లాంటివి కూడా తగ్గేందుకు తోడ్పడుతుంది. వివరాలివే..

ఈ ఫేస్‍ప్యాక్ తయారీ, వాడకం ఇలా..

ఈ ఫేస్‍ప్యాక్ కోసం పచ్చి పాలు, బ్రెడ్ ఉండాలి. ఓ గిన్నెలో పాలు తీసుకొని దాంట్లో 4 నుంచి 5 బ్రెడ్ పీస్‍లను నానెబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత చేత్తో కలపాలి. పేస్ట్‌లా ఆ మిశ్రమాన్ని చేసుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువై జారుగా ఉంటే సరిడా బ్రెడ్ ముక్క వేసుకోవచ్చు. ఇలా ఈ ఫేస్‍‍ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

ఈ పాలు, బ్రెడ్ ఫేస్‍ప్యాక్‍ను ముఖానికి మొత్తం రాసుకోవాలి. కావాలంటే మెడపై కూడా పూసుకోవచ్చు. ముఖానికి రాసుకున్నాక 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి.

ప్రయోజనాలు ఇవే

పాలల్లో ఉండే చాలా పోషకాలు చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ప్యాక్ కోసం పచ్చి పాలనే వినియోగించాలి. పచ్చి పాలల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. స్కిన్ గ్లోను పెంచుతాయి. పాలల్లో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి ఇవి కూడా మేలు చేస్తాయి. చర్మంపై మొటిమలు, ర్యాషెస్, మచ్చలు లాంటివి తగ్గేందుకు పాలు సహకరిస్తాయి.

బ్రెడ్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్మును, అదనంగా ఉన్న జిడ్డును ప్రభావవంతంగా తొలగించగలదు. మొటిమలు, నల్లమచ్చలను తగ్గించగలదు. అందుకే పాలు, బ్రెడ్ కలిపి చేసుకునే ఈ ప్యాక్ చర్మానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ముఖం చర్మం మెరుపును పెంచుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గేలా చేస్తుంది. చర్మ మృధుత్వాన్ని పెంచుతుంది.

పసుపుతోనూ..

పసుపు, పచ్చి పాలతోనూ చేసుకునే ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్‍ల పాలను ఓ టీస్పూన్ పసుపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. పసుపులో యాంటీఇన్‍ఫ్లమేటరీతో పాటు చర్మం మెరుపును పెంచే గుణాలు ఉంటాయి. పాలు చర్మానికి తేమను అందిస్తాయి. పసుపు, పాలను కలిపి చేసుకునే ఫేస్‍ప్యాక్ చర్మానికి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. నల్లటి మచ్చలు తగ్గుతాయి. చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడితే మంచిది.

Whats_app_banner