Egg Shells for Skin: కోడిగుడ్డు పెంకులతో చర్మానికి ప్రయోజనాలు! ఎలా వాడాలో తెలుసుకోండి
Egg Shells: కోడిగుడ్ల పెంకులను చాలా మంది పారేస్తుంటారు. అయితే, ఆ పెంకులు కూడా కొన్నింటికి ఉపయోగపడతాయి. ఆ పెంకులతో చర్మానికి మేలు జరుగుతుంది. వీటిని ఎలా వాడాలో ఇక్కడ చూడండి.
కోడిగుడ్ల పెంకులను చాలా మంది పడేస్తారు. వీటి ఉపయోగాలు తెలియక చాలా మంది ఇలానే చేస్తుంటారు. అయితే, గుడ్డులోనే కాకుండా దానిపై ఉండే పెంకులోనూ పోషకాలు బాగానే ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా వాడుకోవచ్చు. కోడిగుడ్డు పెంకులను చర్మానికి కూడా వాడుకోవచ్చు. ఇవి చర్మ సమస్యలను తగ్గించగలవు. చర్మానికి గుడ్ల పెంకులు ఎలా వాడుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
గుడ్ల పెంకులతో చర్మ ప్రయోజనాలు ఇలా..
కోడిగుడ్ల పెంకుల్లో మెంబ్రేన్, కాల్షియం, ప్రోటీన్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. గుడ్ల పెంకుల వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చర్మం మెరుపును పెంచడం, ముడతలు, మచ్చలను తగ్గించడం, రంధ్రాలు పూడిపోయేలా చేయడం సహా మరిన్ని లాభాలను గుడ్ల పెంకులు అందించగలవు.
మచ్చలు తగ్గేందుకు పెంకులు, తేనె
కోడిగుడ్డు పెంకులు, తేనెతో కలిపి చేసుకునే ఈ ఫేస్ ప్యాక్.. చర్మంపై మచ్చలన తగ్గించగలదు. ఓ గుడ్డు పెంకులను ముందుగా పొడి చేసుకోవాలి. దాంట్లో రెండు టేబుల్ స్పూన్‍ల తేనె కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. దాన్ని ముఖంపై రాసుకోవాలి. అది ఆరిపోయే వరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత ముఖం కడిగేసుకోవాలి. వారానికి ఓసారి ఇలా చేస్తే మచ్చలు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
వాపు తగ్గేందుకు పెంకులు, యాపిల్ సిడెర్ వెనిగర్
అర కప్పు యాపిల్ సిడెల్ వెనిగర్‌లో రెండు గుడ్ల పెంకులు వేయాలి. ఐదు రోజుల పాటు ఈ రెండింటిని నాననివ్వాలి. దీంతో అది పేస్ట్‌లా అవుతుంది. ఆ మిశ్రమంలో దూదిని ముంచి.. దాన్ని చర్మానికి రాసుకోవాలి. ఆరే వరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మంపై వాపు, మంట తగ్గుతుంది.
పెంకులు, చక్కెరతో..
కోడిగుడ్ల పెంకులు, చెక్కర కలిపి మిశ్రమం కలిపి స్క్రబ్ చేసుకొని రాసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ముందుగా ఓ గుడ్డు పెంకులను పొడిగా చేసుకొని ఓ గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో రెండు టేబుల్ స్పూన్‍ల చక్కెర పొడి, గుడ్డులోని తెల్ల సొన వేసు మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో కడుక్కోవాలి.
పెంకులు, బెల్లంతో..
గుడ్డు పెంకులు, బెల్లం కలిపి చేసుకున్న ఈ మిశ్రమం వల్ల చర్మంపై మచ్చలు తగ్గుతాయి. పోషకాలు అందుతాయి. ముందుగా గుడ్డు పెంకులను పొడిగా చేసుకోవాలి. ఓ గిన్నెలో వేసుకొని దాంట్లో ఓ టేబుల్‍స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖమంతా రాసుకోవాలి. 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్ల నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఓసారి ఇలా చేయాలి.
టాపిక్