మళ్లీ ప్రేమలో పడిన ముగ్గురు పిల్లల తల్లి- దగ్గరుండి ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త!
ముగ్గురు పిల్లల తల్లి తన భర్త అంగీకారంతో తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అతనే ఈ వేడుకను కూడా ఏర్పాటు చేశాడు. బీహార్‌లో జరిగిన ఈ సంఘటన ఇది సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
బీహార్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! ఓ వ్యక్తి.. తన భార్యకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిపించాడు! ఈ అసాధారణ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. లవ్, రిలేషన్షిప్స్, సామాజిక నిబంధనల గురించి సోషల్ మీడియాలో చర్చలు తెగ జరుగుతున్నాయి.
ఇదీ జరిగింది..
బీహార్‌లోని సహర్సాలో ముగ్గురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ ఇటీవల తన భర్త పూర్తి అంగీకారంతో.. ఇద్దరు పిల్లల తండ్రి అయిన తన బాయ్‌ఫ్రెండ్‌ని వివాహం చేసుకుంది. పలు మీడియా కథనాల ప్రకారం.. మహిళ భర్త ఈ కొత్త సంబంధానికి అంగీకరించడమే కాకుండా వివాహ వేడుకను సులభతరం చేశాడు.
వాస్తవానికి మొదట వారిది ప్రేమ వివాహమే! 12ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. కానీ ఆ మహిళ, మరో వ్యక్తి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఈ జంట సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి, ఆమె భార్తే వారిద్దరికి పెళ్లి జరిపించాడు.
ఈ నాటకీయ ఘట్టానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అయ్యాయి. 'ఘర్ కే కాలేష్' అనే హ్యాండిల్ ఈ వీడియోని షేర్ చేసింది. వారి కలయికకు ప్రతీకగా ప్రియుడు మహిళ నుదుటిపై సంప్రదాయ కుంకుమను పెట్టడం ఈ వీడియోలో కనిపించింది. ఇదిలావుండగా, ఈ వేడుకకు హాజరైన మహిళ మాజీ భర్త భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఉంటే అది దంపతుల బాధ్యతే తప్ప తనది కాదని చెప్పడం వినిపించింది!
ఈ అసాధారణ ఘటనపై ఆన్లైన్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మొదటి భర్త నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, ఇంకొందరు ఆధునిక సంబంధాల సంక్లిష్టతలను ప్రశ్నిస్తున్నారు.
వధువు వింత ప్రవర్తన..!
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మరో అసాధారణ పెళ్లికి సంబంధించిన సంఘటన చోటు చేసుకుంది. మీడియా నివేదిక ప్రకారం.. వివాహం అనంతరం జరిగే సాంప్రదాయ “ముహ్ దిఖై” వేడుక సందర్భంగా వధువు.. బీర్, గంజాయి, మేక మాంసం డిమాండ్ చేసింది!
వరుడు మొదట బీరు ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ మిగిలిన డిమాండ్ల కోసం ఆమె పట్టుబట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన వరుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరికి స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసు కౌన్సెలింగ్ సందర్భంగా ఈ వ్యవహారం మరింత నాటకీయ మలుపు తిరిగింది. వధువు మహిళ కాదని, థర్డ్ జెండర్ అని వరుడి కుటుంబం ఆరోపించడంతో అప్పటికే ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. దిగ్భ్రాంతికరమైన వాదనలు ఉన్నప్పటికీ, ఇరు కుటుంబాలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మధ్యవర్తిత్వం వహించి వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కుటుంబాలను ప్రోత్సహించారు.
సంబంధిత కథనం