NNS December 21st Episode: మిస్సమ్మను ఇంట్లోనే చంపేలా మనోహరి ప్లాన్- అమర్‌కు కిస్ పెట్టిన భాగీ- మనును వణికించిన అరుంధతి-nindu noorella savasam december 21 episode bhagi kissed amar manohari afraid to arundhathi zee telugu nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 21st Episode: మిస్సమ్మను ఇంట్లోనే చంపేలా మనోహరి ప్లాన్- అమర్‌కు కిస్ పెట్టిన భాగీ- మనును వణికించిన అరుంధతి

NNS December 21st Episode: మిస్సమ్మను ఇంట్లోనే చంపేలా మనోహరి ప్లాన్- అమర్‌కు కిస్ పెట్టిన భాగీ- మనును వణికించిన అరుంధతి

Sanjiv Kumar HT Telugu
Dec 21, 2024 08:49 AM IST

Nindu Noorella Saavasam December 21st Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 21 ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని కలుస్తుంది మనోహరి. మిస్సమ్మను ఎవరు చంపలేరు మీరు తప్పా అని బాబ్జీ అంటే.. అవును, దాని చావు నా చేతుల్లోనే రాసి ఉందని మనోహరి అంటుంది. అమర్‌కు బొట్టు పెట్టబోయి కిస్ చేస్తుంది భాగీ.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 21 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 21 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 21st December Episode)లో లారీ ప్రమాదం నుంచి అరుంధతిని తప్పించేందుకు ప్రయత్నించి పడిపోతుంది మిస్సమ్మ. మిమ్మల్ని పట్టుకుంటే నాకేమి అనిపించలేదని అనుమానపడుతుంది మిస్సమ్మ.

yearly horoscope entry point

మరో ప్రమాదం

నువ్వు ఇటొచ్చావు.. నేను అటు వెళ్లాను. తర్వాత నువ్వు అటు వచ్చావు. అంటూ అరుంధతి ఏదేదో చెప్తుంటే.. కన్ఫ్యూజ్‌గా ఉన్నా.. అర్థం అయినట్టు అనిపిస్తుంది. మళ్లీ కానట్టు అనిపిస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే గుప్త గారు బాగా కవర్‌ చేశానా..? అని అడుగుతుంది. కవర్‌ చేశావు కానీ నీకు మరో ప్రమాదం వచ్చుచున్నది అంటూ రాథోడ్‌ కారులో రావడం చూపిస్తాడు గుప్త.

అయ్యో ఇప్పుడు ఎలా గుప్త గారు అంటూ అరుంధథి కంగారు పడుతుంటే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే అంటాడు గుప్త. దాంతో వెంటనే ఆరు, మిస్సమ్మ నాకు చాలా పనుంది వెళ్తున్నాను అంటూ మిస్సమ్మ వద్దని చెప్పినా వినకుండా వెళ్లిపోతుంది. ఇంతలో రాథోడ్‌ రాగానే మిస్సమ్మ తనకు పెద్ద యాక్సిడెంట్‌ మిస్‌ అయిందని అని చెప్తుంది. అక్కే కాపాడింది అంటూ చెప్పి మిస్సమ్మను అక్కా అని పిలుస్తుంది.

మిస్సమ్మ పిలిచిన సైడు చూసిన రాథోడ్‌ అక్కడ ఎవరూ ఉండరు నాకు ఎవరు కనిపించరు అని మనసులో అనుకుంటాడు. మిస్సమ్మ నువ్వు మీ అక్క బాగానే ఉన్నారు. ఆమె కనిపించదు. నీకు వినిపించడం లేదు. వచ్చి కారు ఎక్కు వెళ్దాము అంటాడు రాథోడ్. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా..? అంటుంది మిస్సమ్మ. తర్వాత రాథోడ్‌ కారు ఎక్కించుకుని వెళ్లిపోతాడు.

చావడం నాకు సరదానా

మనోహరి హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని తిడుతుంది. అసలు మనమేం అనుకున్నాం నువ్వేం చేశావు అంటుంది. బాబ్జీ ఏడుస్తూ ఏంటి మేడం అదేదో చావడం నాకు సరదా అన్నట్టు చెప్తున్నారు. యాక్సిడెంట్‌ చేద్దామనుకుంటే నాకు యాక్సిడెంట్‌ అయింది మేడం అంటాడు బాబ్జీ. చూడు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది మనోహరి.

నేను ఆవిడను చంపడానికి కరెక్టుగా మిస్సమ్మ వైపే వెళ్తున్నాను మేడం అంటూ అసలేం జరిగిందో తెలుసుకునే లోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం అంటాడు. బంగారం లాంటి అవకాశాన్ని మిస్‌ చేశావు కదరా..? అంటూ తిడుతుంది మనోహరి. మీరేం టెన్షన్‌ పడకండి మేడమ్ నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడను స్మశానానికి పంపించేస్తాను అంటాడు. ఎలా చంపుతావో చెప్పు అంటూ నిలదీస్తుంది మనోహరి.

ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థం అయింది వెంటనే ఆ ఘోరాను పట్టుకోవాలి అనగానే.. బాబ్జీ ఈ పని ఆ ఘోర వల్ల కూడా కాదు మేడం. ఆ పని చేయడానికి ఒకరున్నారు అని బాబ్జీ అంటాడు. దాంతో మనోహరి ఎవరు అని అడుగుతుంది. మీరే మేడం ఆత్మలను గుప్పిట్లో పెట్టుకునే ఘోరాను, నన్ను మీ గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఆవిడను చంపేది మీరే మేడం అని బాబ్జీ చెప్పగానే అవును నిజమే దాని చావు నా చేతుల్లో రాసి పెట్టి ఉంది కాబట్టే అది ఇన్ని సార్లు తప్పించుకుంది అని అంటుంది మనోహరి.

మిస్సమ్మ యాక్సిడెంట్‌ గురించి

మిస్సమ్మ ఇక నీ చావును ఎవ్వరూ ఆపలేరు అంటుంది మనోహరి. ఇంటికి వచ్చిన మిస్సమ్మ, రాథోడ్‌ డల్లుగా ఉండటంతో ఏమైందని శివరామ్ అడుగుతాడు. పెద్ద యాక్సిడెంట్‌ మిస్‌ అయిందని లారీ వచ్చి గుద్దబోతే నేను పక్కింటి అక్క తప్పించుకున్నామని చెప్తుంది మిస్సమ్మ. దీంతో శివరామ్, నిర్మల షాక్‌ అవుతారు. ఇక నువ్వెప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని జాగ్రత్తలు చెప్తారు. తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చి అమర్‌ దగ్గరకు వెళ్తుంది మిస్సమ్మ.

ప్రసాదం ఇవ్వబోతే వద్దని చెప్తాడు అమర్‌. తర్వాత మిస్సమ్మ బొట్టు పెట్టబోతుంటే వద్దని తప్పించుకుంటాడు. దీంతో మిస్సమ్మ బలవంతంగా బొట్టు పెడుతుంది. అమర్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగానే జారిపోయి అమర్‌కు కిస్‌ చేస్తుంది మిస్సమ్మ. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్‌ అవుతుంది. గార్డెన్‌లో కూర్చున్న అరుంధతి లారీ యాక్సిడెంట్‌ గురించే ఆలోచిస్తుంది.

బాలికా ఈ శిరోభారము మోయుట మా వల్ల కావడం లేదు. నువ్వు ఇంకొకసారి చేయోద్దన్న పని చేస్తే.. కాపాడుటకు నేను రాను అంటాడు గుప్త. దీంతో ప్రమాదం జరిగి ఉండుంటే అని అరుంధతి అడుగుతుంది. ఏమున్నది నీ స్నేహితురాలు పన్నిన పన్నాగానికి నీ సోదరి అంటూ గుప్త ఆగిపోగానే.. ఆగిపోయారేం గుప్త గారు చెప్పండి. ఆ లారీ మిస్సమ్మను గుద్దేసేది. నా లాగే ఒకరి పంతానికి మిస్సమ్మ ప్రాణాలు కోల్పోయేది అంటుంది.

మనోహరిని భయపెట్టిని ఆరు

మిస్సమ్మ నా తోడ బుట్టిన చెల్లెలు గుప్త గారు తాను చేయని తప్పుకు. మనోహరి దుర్బుద్దికి మిస్సమ్మ ఎందుకు బలి కావాలి అంటూ అరుంధతి ప్రశ్నించగా.. బాలిక ఎందుకు అట్లా మాట్లాడుతుంటివి ఏమీ కాలేదు కదా అంటాడు గుప్త. అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని చావాలి. మనోహరి కుట్రకు ఎందుకు బలి కావాలి. నీవు అడుగుతున్న ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుతున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయలేము అంటాడు గుప్త.

ఆ జగన్నాథుడిని నమ్మి ముందుకు వెళ్లుట తప్ప ఏమీ చేయలేము అంటాడు గుప్తా. ఇంతలో మనోహరి ఇంటికి రావడంతో అరుంధతి కోపంగా గట్టిగా మను అని పిలుస్తుంది. మనోహరి భయంతో ఆగిపోతుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner