తెలుగు న్యూస్ / ఫోటో /
AP Liquor Prices : లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ - మద్యం ధరలు తగ్గించిన మరికొన్ని కంపెనీలు..!
- Liquor prices in Andhrapradesh: ఏపీలో మద్యం ధరలు దిగివస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా మరికొన్ని కంపెనీలు మద్యం బేస్ ప్రైస్‌ను తగ్గించాయి. దీంతో రాష్ట్ర బెవరేజస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గింది.

(1 / 6)
ఏపీలోని మందుబాబులకు కిక్కేంచే వార్త వచ్చేసింది. కొన్ని కంపెనీలు బేసిక్ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. ఈ మేరకు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో మద్యం ధరలు కూడా తగ్గనున్నాయి.(unshplash.com)
(2 / 6)
దాదాపు ఏపీలోని పదికిపైగా కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. దీంతో ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది.
(3 / 6)
ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి.. ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.(istockphoto)
(4 / 6)
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు దాటింది. మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై కూడా సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అయితే కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి.
(5 / 6)
హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది.
ఇతర గ్యాలరీలు