Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు-saripodhaa sanivaaram collections not dropped despite of heavy rains and getting house fulls says producer dil raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు

Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 02, 2024 06:38 PM IST

Dil Raju on Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లలో దూసుకెళుతోంది. భారీ వర్షాలు పడుతున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. ఈ విషయాన్నే నిర్మాత దిల్‍రాజు చెప్పారు. ఈ మూవీ ట్రెండ్ ఎంత బలంగా ఉందో నేడు ఓ మీడియా మీట్‍లో వెల్లడించారు. ఆ వివరాలివే..

Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు
Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు

సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ కమర్షియల్ చిత్రం మొదటి నుంచి దుమ్మురేపుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కాగా.. మొదటి నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు దూకుడుగా వస్తున్నాయి. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా సరిపోదా శనివారం మూవీకి కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఈ విషయంపై నిర్మాత దిల్‍రాజు నేడు (సెప్టెంబర్ 2) మాట్లాడారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులను ఆయనే తీసుకున్నారు.

సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ-రిలీజ్ మీట్‍కు దిల్‍రాజు నేడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిపోదా శనివారం కలెక్షన్లపై ప్రశ్నలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు.

వర్షాలు ఉన్నా స్టడీగా..

ఇప్పుడు ఉన్న భారీ వర్షాలకు సహజంగా సరిపోదా శనివారం కలెక్షన్లు భారీగా పడిపోవాలని, కానీ అద్భుతంగా నిలకడగా ఉన్నాయని దిల్‍రాజు చెప్పారు. బయటికి వెళ్లేలా వాన తగ్గితే చాలా చోట్ల థియేటర్లు ఫుల్ అవుతున్నాయని అన్నారు. “మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇప్పుడు పడుతున్న వర్షాలకు సరిపోదా శనివారం కలెక్షన్లు గణనీయంగా పడిపోవాలి. కానీ అద్భుతంగా హోల్డ్ అయ్యాయి. బయట వర్షం పడడం లేదు.. థియేటర్‌కు ఇబ్బంది లేకుండా వెళ్లగలమనే పరిస్థితిలో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి” అని దిల్‍రాజు చెప్పారు.

ఆరోజు ఒక్కటే తగ్గింది

సరిపోదా శనివారం సినిమాకు గురువారం (ఆగస్టు 29) కంటే శుక్రవారం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయని దిల్‍రాజు చెప్పారు. అయితే, శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకున్నాయని అన్నారు. “గురువారం కంటే శుక్రవారం సాధారణంగా తగ్గింది. శనివారం, ఆదివారం డే1 లాగా ఉండింది. నేడు ఏపీలో మ్యాట్నీలు అన్ని థియేటర్లు ఫుల్” అని దిల్‍రాజు తెలిపారు.

నేటితో నైజాం బ్రేక్ఈవెన్

సరిపోదా శనివారం మూవీకి రెండో రోజు కంటే నేడు ఐదో రోజు మ్యాట్నీలకు ఎక్కువ ఆక్యుపెన్సీ ఉందని దిల్‍రాజు అన్నారు. ఐదో రోజు సోమవారం అయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయని చెప్పారు. మంచి సినిమా వస్తే వర్షాలు వచ్చినా, తుఫానులు వచ్చినా ప్రేక్షుకులు రెడీగా ఉన్నట్టే కదా అని దిల్‍రాజు చెప్పారు. నైజాంలో నేటితో బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు గాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్‍రాజే సొంతం చేసుకున్నారు.

మూడు రోజుల కలెక్షన్లు ఇలా..

సరిపోదా శనివారం సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.68.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. భారీ అంచనాలకు తగ్గట్టే ఈ మాస్ కమర్షియల్ చిత్రం అదరగొడుతోంది. దిల్‍రాజు మాటలను బట్టి చూస్తే సోమవారం కూడా ఈ చిత్రం బాగానే కలెక్షన్లు రాబట్టేలా ఉంది. టికెట్ల బుకింగ్స్ ట్రెండ్ కూడా బలంగానే ఉంది.

సరిపోదా శనివారం చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించారు. ఎస్‍జే సూర్య విలన్ పాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించారు. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.