OTT Bold: ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!-girls will be girls ott release on amazon prime and this new bold movie get top 6 place in trending india wide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold: ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!

OTT Bold: ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!

Sanjiv Kumar HT Telugu
Dec 21, 2024 12:53 PM IST

Girls Will Be Girls OTT Streaming And Trending: మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీ ఫజల్, ఇన్‌సైడ్ ఎడ్జ్ నటి రిచా చద్దా కలిసి నిర్మించిన లేటెస్ట్ ఓటీటీ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. డిసెంబర్ 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ రిలీజైన ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!
ఓటీటీ ట్రెండింగ్‌లో న్యూ బోల్డ్ మూవీ.. కామ కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!

Girls Will Be Girls OTT Release And Trending: ఓటీటీలోకి ఇటీవల వచ్చిన న్యూ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌తో పాటు డెప్త్ మెసెజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది.

శృంగార కోరికలు

గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీలో హిమాలయన్ బోర్డర్ స్కూల్‌లో మీరా కిశోర్ అనే 16 ఏళ్ల అమ్మాయి చదువుకుంటుంది. అక్కడ చాలా స్ట్రిక్ రూల్స్ ఉంటాయి. స్కర్ట్ మోకాళ్ల కిందివరకు ఉండాలి, అబ్బాయిలతో మాట్లాడకూడదు వంటి కఠిన నియమనిబంధనలు ఉంటాయి. కేవలం తల్లి అనిలాతోపాటు జీవించే మీరాకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి.

కౌమార దశలో వచ్చే కోరికలు

కౌమార దశలో ఉన్న సాధారణ ఆడపిల్లకు వచ్చే కామ కోరికలు లాగానే మీరాకు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూ చదువులో ముందుకు వెళ్తుంటుంది. కానీ, అదే స్కూల్‌లో శ్రీ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఓ రోజు శ్రీని ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయ చేస్తుంది మీరా. తన ఫ్రెండ్షిప్ కూతురు చదువు ఆటంకం కాకూడదని శ్రీతో చెబుతుంది అనిలా.

విచిత్రంగా తల్లి ప్రవర్తన

దానికి శ్రీ కూడా అలా జరగదని అంటాడు. కట్ చేస్తే శ్రీతో మీరా తల్లి సన్నిహితంగా మెలుగుతుంది. మీరా, శ్రీ చదువుకుంటుంటో డోర్స్ ఓపెన్‌గా ఉంచడం, స్టడీస్‌కు శ్రీని రెగ్యులర్‌గా రమ్మనడం వంటివి చేస్తుంది అనిలా. ఇదంతా నీపై ప్రేమతో చేస్తుందని మీరాకు చెబుతాడు శ్రీ. కానీ, మీరాకు మాత్రం తల్లి ప్రవర్తన విచిత్రంగా తోస్తుంది. మరోవైపు తల్లికి తెలియకుండా శ్రీతో ఏకాంతంగా గడుపుతుంటుంది మీరా.

బోల్డ్ సన్నివేశాలతో

మరి మీరా, శ్రీ శారీరక సంబంధం గురించి తల్లికి తెలుస్తుందా. శ్రీపై అనిలాకు ఉంది ఏంటీ కూతురి బాయ్‌ఫ్రెండ్‌పై తల్లికి ఉన్న చనువు ఎటు మలుపు తిప్పింది వంటి ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్ సన్నివేశాలతో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ కథ సాగుతుంది. దాదాపు 8 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా సుమారుగా ఐదారు అవార్డ్స్ గెలుచుకుని సత్తా చాటింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అనంతరం నేరుగా డిసెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా వ్యాప్తంగా టాప్ 6 ప్లేస్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్

గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమాను పాపులర్ వెబ్ సిరీస్‌లు మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, ఇన్‌సైడ్ ఎడ్జ్‌ నటి రిచా చద్దా కలిసి సంయుక్తంగా నిర్మించారు. భార్యాభర్తలైన వీరిద్దరికి ఇదే తొలి ఓటీటీ ప్రొడక్షన్ మూవీ. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ రావడం విశేషం. దీన్ని బట్టి ఈ మూవీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Whats_app_banner