OTT Bold Thriller: ఐదుగురు భర్తలతో భార్య శృంగారం- ఓటీటీలో తమిళ బోల్డ్ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?-panchali ott streaming on ullu ott bold web series panchali explained in telugu wife with five husbands story anupriya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Thriller: ఐదుగురు భర్తలతో భార్య శృంగారం- ఓటీటీలో తమిళ బోల్డ్ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

OTT Bold Thriller: ఐదుగురు భర్తలతో భార్య శృంగారం- ఓటీటీలో తమిళ బోల్డ్ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Published Oct 26, 2024 01:25 PM IST

Panchali Web Series OTT Streaming: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న డిఫరెంట్ బోల్డ్ కంటెంట్ మినీ వెబ్ సిరీస్ పాంచాలి. ఐదుగురు భర్తలతో శృంగారం చేసే భూమి అనే పాత్ర చుట్టూ పాంచాలి కథ నడుస్తుంది. మైండ్ బ్లాక్ చేసే ఈ అడల్ట్ కంటెంట్ మినీ వెబ్ సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఐదుగురు భర్తలతో భార్య శృంగారం- ఓటీటీలో తమిళ బోల్డ్ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?
ఐదుగురు భర్తలతో భార్య శృంగారం- ఓటీటీలో తమిళ బోల్డ్ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Panchali Mini Series OTT Release: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో రకాల జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని ప్రత్యేకంగా ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలు, వెబ్ సిరీసులు, మినీ సిరీసులు నిర్మిస్తుంటాయి. ఒరిజినల్ సిరీస్ లేదా ఒరిజిన్ మూవీగా వాటిని ఓటీటీలోకి తీసుకొస్తుంటాయి.

హైలెట్ అవుతున్న బోల్డ్ సినిమాలు

అలా నిర్మించే వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉంటున్నాయి. అయితే, థియేటర్లలో చూపించలేని కంటెంట్‌ను ఓటీటీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ వేదికలు. డిఫరెంట్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఓటీటీలో బోల్డ్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులకు లెక్కలేదు. వాటిలో కొన్ని మాత్రం చాలా హైలెట్ అవుతుంటాయి.

అలాంటి వాటిలో 2019లో వచ్చిన తమిళ బోల్డ్ మినీ వెబ్ సిరీస్ పాంచాలి ఒకటి. ఇందులో మంచు మనోజ్ పోటుగాడు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన అనుప్రియ గోయెంకా మెయిన్ లీడ్ రోల్‌లో నటించింది. పాంచాలి మినీ వెబ్ సిరీస్‌లో అనుప్రియ గొయెంకా భూమి అనే పాత్రలో ఆకట్టుకుంది. ఈ సిరీస్ అంతా భూమి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

మరిదిని ఇష్టపడి

భూమి అనే పాత్రకు బల్లి, నందు, జిన్ను, వీరు, యోగి ఐదుగురు భర్తలుగా ఉంటారు. అయితే, వీరంతా అన్నదమ్ములు కావడం షాకింగ్ విషయం. అయితే, ముందుగా భూమికి నలుగురు భర్తలు మాత్రమే ఉంటారు. వారితో భూమి సంసారం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. ఇంతలో సిటీ నుంచి తన భర్తల తమ్ముడు యోగి వస్తాడు. మరిదిని కూడా ఇష్టపడుతుంది భూమి.

కానీ, మరిది మాత్రం భూమిని దూరంగా పెడతాడు. సిటీలో చదువుకుంటున్న తమ్ముడు తమలాగే భూమిని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తారు. కానీ, అందుకు ఒప్పుకోడు యోగి. పిల్లలు ఎవరికి పుడతారో కూడా తెలియని ఆమెను నేను వివాహం చేసుకోలేనని చెబుతాడు. కానీ, ఓ రాత్రి భూమి భర్తలంతా ఒక్కొక్కరిగా వచ్చి ఆమెతో శృంగారంలో పాల్గొంటారు. అది చూసిన మరిది కూడా భూమితో ఇంటిమేట్ అవుతాడు.

పెళ్లి చేసుకోకపోవడంతోనే

కట్ చేస్తే తర్వాతి రోజు వారు ఇంట్లో పూజించే దేవుడి విగ్రహం నుంచి రక్తం రావడాన్ని గమనిస్తారు అన్నదమ్ములు. దాంతో భూమిని యోగి పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని, ఇప్పుడే వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందనేదే మిగతా పాంచాలి మినీ వెబ్ సిరీస్ స్టోరీ.

మరిదిని ఐదో భర్తగా భూమి పెళ్లి చేసుకుంటుందా? వారితో భూమి ఎందుకు అలా ఉంటుంది? దానిక గల కారణాలు ఏంటీ? వారి మధ్య ఏదైనా గొడవలు జరుగుతాయా? భూమి ప్లాన్ ఏంటీ? వంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఘాటు శృంగార సీన్లతో సాగే ఐదు ఎపిసోడ్స్ ఉన్న పాంచాలి వెబ్ సిరీస్ కథ. పాంచాలి మినీ సిరీస్‌లో కేవలం 20 నిమిషాల నిడివితో 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి.

1 గంట 40 నిమిషాలు మాత్రమే

సుమారుగా గంట 40 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న పాంచాలి సిరీస్ ఉల్లు ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ వెబ్ సిరీస్ పాంచాలి తమిళ, తెలుగు భాషలో అందుబాటులో ఉంది. ఇదివరకు ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన పాంచాలి ఇప్పుడు అందుబాటులో లేదు. విపరీతమైన బోల్డ్ కంటెంట్ ఉన్న పాంచాలి సిరీస్‌ను ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడటం మంచిది.

Whats_app_banner