Manchu Manoj: తను నా ఫేవరేట్ తమ్ముడు.. ఫస్ట్ నుంచి అతని యాక్టింగ్‌కు ఫ్యాన్‌ని.. మంచు మనోజ్ కామెంట్స్
Manchu Manoj About Satyadev In Zebra Teaser Launch: నేచురల్ స్టార్ నాని జీబ్రా టీజర్ రిలీజ్ చేశారు. ఈ జీబ్రా టీజర్ లాంచ్‌లో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన ఫేవరేట్ తమ్ముడు సత్యదేవ్ అని, అతని యాక్టింగ్‌కు మొదటి నుంచి అభిమానిని అని మంచు మనోజ్ చెప్పారు.
Manchu Manoj Comments: టాలెంటెండ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ చిత్రం 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన జీబ్రా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మంచు మనోజ్ కామెంట్స్
అలాగే, రీసెంట్‌గా జీబ్రా మూవీ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నాని రిలీజ్ చేసిన జీబ్రా టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే జీబ్రా టీజర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా రాక్‌స్టార్ మంచు మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎంతలా కష్టపడ్డారో
"అందరికీ నమస్కారం. ఎస్‌ఎన్ రెడ్డి గారు నాకు మంచి శ్రేయోభిలాషి. అలాంటి మంచి వ్యక్తికి మంచి జరగాలనే కోరుకుంటాం. ఈ సినిమా కోసం భారీ గా ఖర్చు చేసి, అందరూ ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫేవరట్.. తమ్ముడు సత్యదేవ్. తను వండర్‌ఫుల్ యాక్టర్. ఫస్ట్ నుంచి తన యాక్టింగ్‌కి నేను ఫ్యాన్‌ని. టీజర్ అదిరిపోయింది" అని మంచు మనోజ్ చెప్పాడు.
తెలుగు నేర్చుకుని మరి
"ఈ జీబ్రా సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వెల్‌కమ్ ధనంజయ. సత్యరాజ్ గారి క్యారెక్టర్ వేరే లెవల్ ఉంది. దర్శకుడు తెలుగు నేర్చుకొని సినిమా చేయడం హ్యాట్సప్. ఆర్ఆర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని మంచు మనోజ్ తెలిపాడు.
ఆ నమ్మకంతోనే తీశాం
డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ మాట్లాడుతూ.. "అందరికీ థాంక్ యూ. ఇలాంటి మంచి కంటెంట్‌ని నమ్మి ప్రోడ్యుస్ చేసిన నిర్మాతలకు థాంక్స్. ఆడియన్స్ మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. మీ సపోర్ట్ కావాలి. మనోజ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాలో పని చేసిన అందరూ మంచి హ్యుమన్ బీయింగ్స్" అని చెప్పారు.
చాలా కొత్త కంటెంట్
"అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. తప్పకుండా దిన్ని అందరూ ఎంజాయ్ చేశారు. ఇది నాకు లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ" అని జీబ్రా మూవీ హీరోయిన్ జెన్నిఫర్ పిసినాటో పేర్కొంది. నిర్మాత దినేష్ సుందరం మాట్లాడుతూ.. "మనోజ్ గారికి థాంక్స్. జీబ్రా చాలా కొత్త కంటెంట్. వెరీ న్యూ ఎటెంప్ట్. ఈశ్వర్ కార్తీక్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.
మంచి కన్విక్షన్‌తో
నిర్మాత బాల సుందరం మాట్లాడుతూ.. "అందరికీ థాంక్ యూ. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ చాలా మంచి కన్విక్షన్‌తో సినిమా చేశారు. సత్య దేవ్, డాలీ ధనంజయతో పాటు అందరూ చాలా ఎఫెర్ట్ పెట్టారు. సినిమా అందరికీ పండగలా ఉంటుందని భావిస్తున్నాం" అని పేర్కొన్నారు. "మనోజ్ గారికి ధన్యవాదాలు. సత్యదేవ్, డాలీ ధనంజయ గారితో పాటు టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు"అని నిర్మాత ఎస్ఎన్ రెడ్డి తెలిపారు.