Today OTT Movies Telugu: ఓటీటీలో ఎప్పటికప్పుడు సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తూనే ఉంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్. స్ట్రయిట్ తెలుగు మూవీస్‌తోపాటు తెలుగు డబ్బింగ్ చిత్రాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయి తెలుగు భాషలో ఉన్న నాలుగు టాప్ సినిమాలు, సిరీసులపై లుక్కేద్దాం.
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు మొదటిసారిగా మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ చిత్రం స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వం వహించిన స్వాగ్ మూవీలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ, సీనియర్ బ్యూటి మీరా జాస్మిన్, హాట్ సుందరి దక్ష నాగర్కర్ ముగ్గురు హీరోయిన్స్‌గా అలరించారు. శ్రీ విష్ణు తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన స్వాగ్ చిత్రాన్ని మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
మగవాళ్లు, ఆడవాళ్లు అనే బేధం ఎక్కడి నుంచి వచ్చింది, పూర్వ కాలంలో జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉండేదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, సుమారు 21 రోజులకే స్వాగ్ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్వాగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వినోదాన్ని పంచే ఈ సినిమాను ఎంచక్కా వీకెండ్‌లో ఎంజాయ్ చేయొచ్చు.
తమిళ స్టార్ హీరో కార్తి, సీనియర్ యాక్టర్, ధ్రువ మూవీ విలన్ అరవింద్ స్వామి మెయిన్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన మంచి ఫీల్ గుడ్ మూవీ సత్యం సుందరం. Meiyazhagan అనే టైటిల్‌తో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేశారు. సూపర్ హిట్ 96 మూవీ డైరెక్టర్ సీ ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ ద్విపాత్రిభినయం చేసిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దో పత్తి. అలాగే, ఇందులో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా కీ రోల్ ప్లే చేసింది. ఇద్దరు ముద్దుగుమ్మలు నటించిన దో పత్తి మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. శశాంక చతుర్వేది డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ మిస్టరీ చిత్రం దో పత్తి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్. కబాలి, షికారు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి ధన్సిక మెయిన్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన తమిళ్, తెలుగు బైలింగువల్ వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్. ఐదో వేదమ్ గురించి చెప్పే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అంతు చిక్కని రహస్యాలు, ఊహకందని సీన్స్‌తో సాగే ఈ సిరీస్ కూడా వీకెండ్‌కు మంచి టైమ్‌పాస్. ఇవే కాకుండా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న బాలకృష్ణ తెలుగు టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 కూడా మంచి ఎంపికే. అన్‌స్టాపబుల్ 4 మొదటి ఎపిసోడ్‌ను ఇవాళ రాత్రి 8:30 గంటలకు ఆహా ఓటీటీలో టెలీకాస్ట్ చేయనున్నారు.