Horror OTT: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!-alien romulus ott streaming on disney plus hotstar and trending in top 2 place sci fi horror alien romulus ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!

Horror OTT: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu
Nov 23, 2024 01:09 PM IST

Alien Romulus OTT Streaming Trending: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్ రోములస్. ఏలియన్ మూవీ ఫ్రాంచైజీలో ఏడో మూవీగా వచ్చిన ఏలియన్ రోములస్ ఓటీటీలో టాప్ 2 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇదే ఓటీటీలో మరిన్ని ఏలియన్ సినిమాలపై లుక్కేస్తే!

ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!
ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!

Alien Romulus OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. వాటికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కిస్తే మరింత మజా వస్తుంది. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై వేల కోట్లు కొల్లగొట్టిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్ రోములస్. ఏలియన్ సినిమా ఫ్రాంచైజీలో ఒక భాగంగా వచ్చిన ఏలియన్ రోములస్ ఓటీటీలోనూ అదరగొడుతోంది.

ఏడో సినిమాగా

1979లో ఏలియన్ మూవీతో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తర్వాత 1986లో మరో సినిమా ఏలియన్స్‌ వచ్చింది. అనంతరం ఏలియన్ 3 (1992), ఏలియన్ రిసరక్షన్ (1997), ప్రోమేథియస్‌ (2012), ఏలియన్ కోవనెంట్ (2017) ఇలా వరుసగా ఏలియన్ ఫ్రాంచైజీలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో ఏడేళ్ల తర్వాత ఏడో సినిమాగా ఏలియన్ రోములస్ మూవీ వచ్చింది.

హారర్ సినిమాల డైరెక్టర్

ఆగస్ట్ 16న అమెరికన్ థియేటర్లలో విడుదలైన ఏలియన్ రోములస్ సినిమా దాదాపుగా రూ. 3 వేల కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే, 1986 తర్వాత వచ్చిన ఏలియన్ సినిమాల్లో ఏలియన్ రోములస్ ది బెస్ట్ అని రివ్యూలు వచ్చాయి. ఏలియన్ రోములస్ సినిమాకు ఫెడే అల్వారిజ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు ఈవిల్ డెడ్, డోంట్ బ్రీత్ వంటి బ్లాక్ బస్టర్ హారర్ మూవీస్‌ను డైరెక్ట్ చేశారు. అలాంటి ఫెడే అల్వారిజ్ తెరకెక్కించిన సినిమానే ఏలియన్ రోములస్.

ఓటీటీ ట్రెండింగ్‌లోకి

అయితే, సూపర్ హిట్ అయిన ఏలియన్ రోములస్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. నవంబర్ 21న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎలియన్ రోములస్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏలియన్ రోములస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఏలియన్ రోములస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

మొదటి స్థానంలో

నవంబర్ 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచింది ఏలియన్ రోములస్. మొదటి స్థానంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కిష్కింద కాండం దక్కించుకోగా ఓటీటీలోకి వచ్చిన మొదటి రోజుకే ట్రెండింగ్‌లోని రెండో స్థానంలోకి చేరుకుంది ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్. దీన్ని బట్టి ఏలియన్ రోములస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్

అంతేకాకండా, ఏలియన్ రోములస్ మూవీకి ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి 7.2 రేటింగ్ రావడం విశేషం. ఇక సినిమా కంటెంట్ ఎంత ఫ్రెష్‌గా ఉందో చెప్పే రొటెన్ టొమాటో సంస్థ 80 శాతం ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఏలియన్ కాన్సెప్ట్ సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. వాటన్నింటిని పక్కన పెట్టి పోల్చకుండా ఏలియిన్ రోములస్ చూస్తే కచ్చితంగా నచ్చే అవకాశం ఉందని క్రిటిక్స్ చెబుతున్నారు.

4 ఏలియన్ సినిమాలు

ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఏలియన్ కాన్సెప్ట్ సినిమాలు అయిన ఏలియన్ కోవనెంట్, ఏలియన్, ఏలియన్స్, ఏలియన్ 3, ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్, ఏలియన్ వర్సెస్ ప్రిడేటర్ రెక్వియెమ్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏలియన్ మూవీ ఫ్రాంచైజీలోని ఏలియన్, ఏలియన్స్, ఏలియన్ 3, ఏలియన్ కోవనెంట్, ఏలియన్ రోములస్ నాలుగు సినిమాలు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner