Telugu Serials: ఈ వీక్ తెలుగు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ - ఏ ఛానెల్‌లో ఏ సీరియల్ టాప్‌లో ఉందంటే?
Telugu Serials: తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియల్స్ అదరగొట్టాయి. కార్తీక దీపం 2 మిగిలిన సీరియల్స్‌కు అందనంత ఎత్తులో నిలిచింది.11.96 రేటింగ్‌ను దక్కించుకుంది. జీ తెలుగు సీరియల్స్‌లో మేఘ సందేశం టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Telugu Serials: ఈ వీక్ తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్‌మాలో కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు అదరగొట్టాయి. ఇన్నాళ్లు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న బ్రహ్మముడి టాప్ ఫైవ్ నుంచి ఔట్ అయ్యింది. జీ తెలుగులో మేఘ సందేశం నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
స్టార్ మా
స్టార్ మా సీరియల్స్ కార్తీక దీపం 2 హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. కార్తీక దీపం 2 సీరియల్‌కు 11.96 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. 11.20 టీఆర్‌పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. చిన్ని సీరియల్ 10.73, ఇంటింటి రామాయణం 10.21తో మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.
ఇన్నాళ్లు నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతూ వచ్చిన బ్రహ్మముడి సీరియల్ 6.31 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. టాప్ ఫైవ్‌లో కూడా ఈ సీరియల్ నిలవలేదు.బ్రహ్మముడి సీరియల్ టైమ్ ఛేంజ్ కావడం, ఇదివరకటితో పోలిస్తే కథలో డ్రామా అంతగా రక్తి కట్టకపోవడం మైనస్‌గా మారింది. ఈ సీరియల్ త్వరలోనే ముగియబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జీ తెలుగు సీరియల్స్...
జీ తెలుగు సీరియల్స్‌లో మేఘ సందేశం దూసుకుపోతుంది. లేటెస్ట్ టీఆర్‌పీలో 8.74 రేటింగ్‌తో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. పడమటి సంధ్యారాగం సీరియల్‌కు 7.82 రేటింగ్ వచ్చింది. నిండు నూరేళ్ల సావాసం 7.69 టీఆర్‌పీతో టాప్ త్రీ ప్లేస్‌ను పదిలం చేసుకుంది.
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్‌తో పోలిస్తే ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ టీఆర్‌పీలో వెనుకబడిపోయాయి.
రంగుల రాట్నం…
ఈటీవీ సీరియల్స్‌లో టీఆర్‌పీ పరంగా రంగులరాట్నం (3.75), మనసంతా నువ్వే (3.41) టాప్‌లో కొనసాగుతున్నాయి. రాబోయి చందమామ, బొమ్మరిల్లు సీరియల్స్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
జెమిని టీవీ సీరియల్స్…
టీఆర్‌పీ రేటింగ్స్‌లో మిగిలిన ఛానెల్స్‌తో జెమిని సీరియల్స్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. జెమిని సీరియల్స్‌లో ఏ ఒక్క సీరియల్ రెండు రేటింగ్‌ను దాటలేదు. శ్రీమద్ రామాయణం 1.55 టీఆర్‌పీతో ఫస్ట్ ప్లేస్‌లో సొంతం చేసుకోగా...కొత్తగా రెక్కలొచ్చేనా 1.36 రేటింగ్‌తో టాప్ టూలో నిలిచింది.
టాపిక్