మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.  

pexels

By Bandaru Satyaprasad
Dec 21, 2024

Hindustan Times
Telugu

బ్లూబెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఇవి న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ ను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.  

pexels

 ఫ్యాటీ ఫిష్- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా డీహెచ్ఏ కలిగిన సాల్మన్, మాకేరెల్ , సార్డినెస్ చేపలు మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు.  ఇవి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.  

pexels

పసుపు శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత నుంచి రక్షిస్తుంది.  

pexels

బ్రోకలీ-యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె, ఇతర సమ్మేళనాల గొప్ప మూలం. బ్రోకలీ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. మెదడు కణాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది.  

pexels

గుడ్లు కోలిన్ కు అద్భుతమైన మూలం. ఇది మెదడు ఎసిటైల్కోలిన్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడే పోషకం. ఇది జ్ఞాపకశక్తికి మద్దతు ఇచ్చే న్యూరోట్రాన్స్ మిటర్.  

pexels

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  

pexels

పాలకూర- పాలకూరలోని లుటీన్, బీటా కెరోటిన్, విటమిన్ కె యాంటీ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.  

pexels

గుమ్మడి కాయ గింజలు మెగ్నీషియం, ఇనుము, జింక్, రాగికి గొప్ప మూలం. న్యూరోట్రాన్స్మిటర్ పనితీరుకు అవసరమైన పోషకాలివి. ఈ ఖనిజాలు దృష్టి, జ్ఞాపకశక్తి పనితీరుకు మద్దతు ఇస్తుంది.  

pexels

ఈ చలికాలంలో వాల్​నట్స్​ తింటే ఇంత మంచిదా..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash