Radhamma Kuthuru Serial: రాధమ్మ కూతురు సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ డేట్ ఇదే - 1500 ఎపిసోడ్స్ తర్వాత ఎండ్‌కార్డ్!
Radhamma Kuthuru Serial: రాధమ్మ కూతురు సీరియల్‌కు జీ తెలుగు మేకర్స్ శుభం పలకబోతున్నారు. ఆగస్ట్ 3న ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతున్నట్లు ప్రకటించింది.
Radhamma Kuthuru Serial: సీరియల్‌కు ఆరంభమే కానీ అంతం ఉండదంటూ ఫన్నీగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. సెంటిమెంట్, డ్రామా, ఎమోషన్స్‌తో ఏళ్లకు ఏళ్లు సాగిపోతూనే ఉంటాయి డైలీ సీరియల్స్. ఇరవై ఏళ్లకుపైగా టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్ చాలానే ఉన్నాయి.
రాధమ్మ కూతురు సీరియల్...
పర్‌ఫెక్ట్ ఎండింగ్‌తో సీరియల్స్‌ను ముగించడం అరుదుగా కనిపిస్తుంటుంది. రాధమ్మ కూతురు టీమ్ అలాంటి ప్లాన్ చేసింది. సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ డేట్‌ను జీ తెలుగు అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 3న ఈ సీరియల్ ఎండింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతున్నట్లు ప్రకటించింది. రాధమ్మ కూతురు సీరియల్ 2019 ఆగస్ట్ 26న ప్రారంభమైంది. ఐదేళ్లలో దాదాపు పదిహేను వందల ఎపిసోడ్స్ వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది.
సీరియల్ కథ ఏమిటంటే?
రాధమ్మ ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ తన ముగ్గురు కూతుళ్లను ఎలా పెంచి పెద్దచేసింది? రాధమ్మ కలల, ఆశయాలు ఆమె కూతురు అక్షర ఎలా నెరవేర్చింది? అక్షర జీవితంలోకి వచ్చిన అరవింద్ ఎవరు? వారిని విడగొట్టాలని శృతి చేస్తోన్న ప్రయత్నాలను అక్షర ఎలా తిప్పికొట్టిందనే అంశాలతో దాదాపు ఐదేళ్ల పాటు ఈ సీరియల్ సాగింది.
రేణు దేశాయ్ గెస్ట్ రోల్...
రాధమ్మ కూతురు సీరియల్‌లో దీప్తి మన్నే, మేఘన రామి, గోకుల్ మీనన్, రాశి, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరియల్‌లో రేణుదేశాయ్ గెస్ట్ పాత్రలో కనిపించింది. ఆరంభంలో ఈ సీరియల్ రాత్రి ఎడుగంటలకు టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆరున్నర గంటలకు మార్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు జీతెలుగులో రాధమ్మ కూతురు ప్రసారమవుతోంది.
ఫేర్‌వెల్ పార్టీ...
రాధమ్మ కూతురు సీరియల్ ఎండింగ్ సందర్భంగా జీ తెలుగు టీమ్ వారికి ఫేర్‌వెల్ పార్టీ ఇస్తూ ఘనంగా వీడ్కోలు పలకబోతుంది.ఈ ఆదివారం రాత్రి ఏడు గంటలకు టెలికాస్ట్ కానున్న డ్రామా జూనియర్స్ షోలో రాధమ్మ కూతురు టీమ్ పాల్గొనబోతున్నారు. ఈ షోలో సీరియల్ యాక్టర్స్‌కు ప్రత్యేక జ్ఞాపికలను ఇవ్వబోతున్నారు. ఈ ఫేర్‌వెల్ పార్టీలో 35 చిన్న కథ కాదుతో పాటు శివం భజే టీమ్స్ పాల్గొననున్నాయి. నివేథా థామస్, అశ్విన్ బాబుతో పాటు పలువురు సినిమా యాక్టర్స్ పాల్గొననున్నారు.
ప్రోమో వైరల్...
ఈ ఫేర్‌వెల్ పార్టీకి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.ఆగస్ట్ 3న రాధమ్మ కూతురుతో పాటు శుభస్య శీఘ్రం సీరియల్ కూడా ఆగస్ట్ 3న ఎండ్ కాబోతోంది. ఈ సీరియల్ యాక్టర్స్ కూడా ఫేర్‌వెల్ పార్టీలో సందడి చేయనున్నట్లు సమాచారం. శుభస్య శీఘ్రం సీరియల్‌లో కృష్ణప్రియ, మహేష్‌బాబు కీలక పాత్రలు పోషించారు.
ఈ సీరియల్‌ను ఐదు వందల ఎపిసోడ్స్‌లోనే ముగించబోతున్నారు. ఈ సీరియల్ అంతగా పాపులర్ కావడంలో మధ్యలోనే ముగింపు పలుకోతున్నట్లు తెలుస్తోంది. రెండు సీరియల్స్‌కు జీ తెలుగు మేకర్స్ ఒకే రోజు ముగింపు పలకడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సీరియల్స్ స్థానంలో ఆగస్ట్‌లో మరో రెండు కొత్త సీరియల్స్ ను జీ తెలుగు మొదలుపెట్టబోతున్నది.