Renu Desai: చాలా కథల్ని రిజెక్ట్ చేశా కానీ - రీఎంట్రీపై రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
Renu Desai: టైగర్ నాగేశ్వరరావులో తాను చేసిన పాత్ర చూసి అకీరా, ఆద్య మెచ్చుకున్నారని, వారి ప్రశంసలతో వంద మార్కులు వచ్చినట్లుగా ఫీలయ్యానని తెలిపింది రేణుదేశాయ్. రీఎంట్రీపై రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Renu Desai: టైగర్ నాగేశ్వరరావు తో పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది రేణుదేశాయ్. 2003లో రిలీజైన పవన్ కళ్యాణ్ జానీ తర్వాత సినిమాలకు దూరమైంది రేణుదేశాయ్. టైగర్ నాగేశ్వరరావుతో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతోంది. రీఎంట్రీపై రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
జానీ తర్వాత చాలా కథలు తనను వెతుక్కుంటూ వచ్చాయని, కానీ వాటిని రిజెక్ట్ చేశానని రేణుదేశాయ్ తెలిపింది. మంచి డైరెక్టర్, బ్యానర్‌తో పాటు సాలిడ్ స్టోరీ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశానని, అలాంటి పాత్ర టైగర్ నాగేశ్వరరావుతో తనకు దొరికిందని రేణుదేశాయ్ తెలిపింది.
ఇందులో తాను హేమలత లవణం పాత్రలో కనిపించబోతున్నట్లు రేణుదేశాయ్ చెప్పింది. రియల్‌లైఫ్‌లో తాను చాలా ఎక్స్‌ప్రెసివ్ అని, కానీ హేమలత లవణ చాలా సెలైంట్‌గా ఉంటుందని, ఆమె పాత్రకు న్యాయం చేసేందుకు తన బాడీలాంగ్వేజ్ మొత్తం మార్పుకున్నట్లు చెప్పింది. కామ్‌గా ఉండటం అలవాటుచేసుకున్నానని తెలిపింది. ఐదు లాంగ్వేజ్‌లలో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతోందని ఊహించలేదని రేణుదేశాయ్ చెప్పింది.
ఈ సినిమా కోసం తమిళ్, మలయాళంతో పాటు తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలిపింది. తెలుగులో డబ్బింగ్ చెప్పడం కష్టమైందని అన్నది. టైగర్ నాగేశ్వరరావులో తన వయసుకు తగ్గ పాత్ర చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నది. నా ఏజ్‌కు తగ్గ, ఢీగ్లామర్ పాత్ర చేయడం గ్రేట్ అని తన కూతురు ఆద్య ఈ క్యారెక్టర్ చూసి మెచ్చుకుంది, అకీరా, ఆద్య ప్రశంసలతో వంద మార్కులు వచ్చినట్లుగా ఫీలయ్యాను అని రేణు దేశాయ్ అన్నది.
రీఎంట్రీపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. స్టూవర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా దర్శకుడు వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కానుంది.