తెలుగు న్యూస్ / ఫోటో /
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్‌కి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు- రూ. 15వేల బడ్జెట్లో ఇవి ది బెస్ట్!
- మంచి ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? దీనికోసం ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! రూ. 15వేలలోపు బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
- మంచి ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? దీనికోసం ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! రూ. 15వేలలోపు బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
(1 / 4)
పోకో ఎం7 ప్రో- ఇందులో 6.67 ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత పోకో హైపర్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా ఎల్వైటీ-600 ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. హోల్ పంచ్ కటౌట్లో ఉన్న ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ రిజల్యూషన్ను కలిగి ఉంది.
(2 / 4)
లావా బ్లేజ్ డుయో:- ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
(3 / 4)
సీఎంఎఫ్ ఫోన్ 1: మొట్టమొదటి సీఎంఎఫ్ ఫోన్.. 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనులను నిర్వహించడానికి మాలి జీ615 ఎంసీ 2 జీపీయూతో కనెక్ట్ చేసి ఉంటుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు,
(4 / 4)
రియల్మీ 14ఎక్స్- ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఇతర గ్యాలరీలు