Heel Pain Excercises: ఉదయం లేవగానే మడమ నొప్పి వేధిస్తోందా? అడుగేయలేనంత ఇబ్బందిని మూడు ఎక్సర్‌సైజ్‌లతో పరిష్కరించుకోండి
Heel Pain Excercises: ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది. ఉదయం లేవగానే కాళ్లను కిందకు పెడుతుంటే చీలమండలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. లోపలి భాగంలో ఏదో పుండు అయినంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఈ మూడు ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఉపశమనం లభిస్తుంది.
Heel Pain Exercises: ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది. ఉదయం లేవగానే కాళ్లను కిందకు పెడుతుంటే చీలమండలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. లోపలి భాగంలో ఏదో పుండు అయినంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఈ మూడు ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఉపశమనం లభిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర అనంతరం, ఉదయం లేవగానే మడమ నొప్పి కాలు కిందపెట్టనీయదు. కాలిలో ఏదో పుండు అయినంతగా వేధిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుందట. పరిష్కారం దొరకక చాలా ప్రయత్నాలు చేసి నొప్పిని అలాగే భరిస్తున్నవారు బోలెడు మంది ఉన్నారు. దానికి పలు కారణాలు ఉండొచ్చట. మడమ ఎముకలో వాపు , హైపో ధైరాయిడిజం, ఆర్థరైటిస్, పాదాల దిగువ భాగంలో వాపు లాంటి సమస్యల వల్ల ఇటువంటి ఇబ్బంది కలగొచ్చు. అలాంటి వారి కోసమే ఈ మూడు ఎక్సర్‌సైజ్‌లు.
వజ్రాసనంలో వజ్రాసన:
భంగిమలో కూర్చోవడం వల్ల చీలమండ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వజ్రాసన భంగిమతో పాటు, తుంటి పూర్తిగా నేలపై విశ్రాంతి తీసుకుంటుందని, చీలమండల మధ్య కొద్దిగా గ్యాప్ ఉందని గుర్తుంచుకోండి. తద్వారా అరికాళ్లలో ఆర్చ్ ఏర్పడి చీలమండ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చీలమండను సాగదీయండి:
రెండు అంగుళాల ఎత్తైన మెట్టుపై నిలబడి గోడకు మద్దతు ఇవ్వండి. అప్పుడు కేవలం పాదాలతో మాత్రమే నిలబడండి. ఆ తర్వాత కాలివేళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తూ పది అంకెలు లెక్కపెట్టండి. ఆపై మీ చీలమండను నేలపై ఉంచి ఇరవై సెకన్ల పాటు ఉండండి. ఇలా చేయడం వల్ల చీలమండ, అరికాళ్ల కండరాలు సాగినట్లుగా మారి కాస్త రిలాక్స్ గా ఫీలవుతారు.
ఐస్ బాటిల్స్‌తో మసాజ్:
చల్లని ఐస్ వాటర్ తో వాటర్ బాటిల్ నింపండి. లేదా చల్లని ఐస్ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు వీటిని మీ అరికాళ్ల కింద ఉంచి, బాటిల్ తో కాళ్లకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే ఐస్ కంప్రెస్ మొత్తం అరికాళ్లలో ఉంటుంది. రోజూ ఈ మూడు వ్యాయామాలు కొద్దిరోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల చీలమండ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తీసుకునే ఆహారం:
ఈ స్పెషలైజ్డ్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు ఆహారం విషయంలోనూ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మెటబాలిక్ గుణాలున్న ఇతర ఆహారం తీసుకోవడం వల్ల అల్కలైన్ గుణాలు పెరిగి సమస్య తీవ్రత తగ్గుతుంది. ఫలితంగా మడమ, పాద కండరాలు బలోపేతం అవుతాయి. ఈ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు మాంసాహారం తగ్గించి, కాఫీ లేదా ఆల్కహాల్ వంటివి కూడా పూర్తిగా మానేయాలి. నీళ్లు కాస్త ఎక్కువగా తాగుతుండాలి.
నొప్పి మూలాలు తెలుసుకోండి: ఈ నొప్పి ఒక్కోసారి మైగ్రేన్, సైనస్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కలగొచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువగా లేదా తరచుగా వస్తుంటే, నొప్పి మూలాలు తెలుసుకుని చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఒకవేళ ఆర్థరైటిస్ లేదా మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్నాయని తెలిస్తే ఆ ఆరోగ్య సమస్యలను వైద్య చికిత్స ద్వారా పరిష్కరించుకోవచ్చు.
తాత్కాలిక ఉపశమనం కోసం:
కొన్నిసార్లు గోముఖి నూనెతో మసాజ్ చేయడం ద్వారా నొప్పి తగ్గేందుకు సహకరిస్తుంది. మడమ నొప్పి పెరగకుండా ఉండేందుకు ఇబ్బందికరంగా లేకుండా ఉండే షూస్ ధరించాలి.
టాపిక్