Yoga for Asthma: ఊపిరితిత్తులకు మేలు చేసే మూడు యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేస్తే ఆస్తమా నుంచి ఉపశమనం!-which yoga asanas should do for asthma relief and improve lugs function ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Asthma: ఊపిరితిత్తులకు మేలు చేసే మూడు యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేస్తే ఆస్తమా నుంచి ఉపశమనం!

Yoga for Asthma: ఊపిరితిత్తులకు మేలు చేసే మూడు యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేస్తే ఆస్తమా నుంచి ఉపశమనం!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2024 06:00 AM IST

Yoga for Asthma: ఆస్తమా ఉన్న వారు కొన్ని యోగాసనాలు చేయడం వల్ల ఉపశమనం దక్కేందుకు తోడ్పడతాయి. శ్వాస తీసుకోవడంలో సమస్యలను తగ్గించగలవు. ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. అలాంటి మూడు ఆసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

Yoga for Asthma: ఊపిరితిత్తులకు మేలు చేసే మూడు యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేస్తే ఆస్తమా నుంచి ఉపశమనం!
Yoga for Asthma: ఊపిరితిత్తులకు మేలు చేసే మూడు యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేస్తే ఆస్తమా నుంచి ఉపశమనం!

ఇటీవలి కాలంలో శ్వాసకోశ ఇబ్బందులు అధికం అవుతున్నాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఫోబియాలు ఆస్తమా బారిన పడేందుకు ప్రధానమైన కారణాలుగా ఉంటున్నాయి. వంశపార్యపరంగా కూడా కొందరికి ఇది వస్తోంది. ఆస్తమా సోరితే ఊరిపితిత్తులకు సమస్యగా మారి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. హెవీ వర్కౌట్స్ చేస్తే ఆస్తమా తీవ్రమవుతుందని కొందరు భావిస్తారు. అది నిజమే అయినా వ్యాయామాలకు పూర్తిగా వీడ్కోలు చెప్పకూడదు. సూటయ్యేవి చేయాలి. ఆస్తమా ఉన్న వారు కొన్ని రకాల యోగాసనాలు వేయవచ్చు. వీటి వల్ల ఉపశమనం దక్కుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గేలా ఈ ఆసనాలు ఉపకరిస్తాయి.

ఆస్తమా ఉన్న వారికి యోగాసనాలు ఉపయోగపడతాయి. ఊరిపితిత్తుల్లోకి ఆక్సిజన్ మెరుగ్గా వెళ్లేందుకు, అందులోని వ్యర్థ వాయువులు సులువుగా బయటికి వచ్చేందుకు ఇవి సహకరిస్తాయి. ఊరిపితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. అలా ఆస్తమా ఉన్న వారు చేయాల్సిన మూడు యోగాసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఉస్ట్రాసనం

  • ముందుగా ఓ చోటు మోకాళ్లపై కూర్చోవాలి.
  • శ్వాస తీసుకొని చేతులు పైకి ఎత్తాలి. ఆ తర్వాత నడుమును వెనక్కి వంచాలి.
  • నడుము వెనక్కి వంచి.. అరచేతులతో అరికాళ్లను పట్టుకోవాలి.
  • ఆ భంగిమకు చేరాక శ్వాస వదలాలి. ఆ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఈ ఉస్ట్రాసన్నాని ఒంటె ఆసనం అని కూడా అంటారు.

ఉస్ట్రాసనం
ఉస్ట్రాసనం (Pexels)

సేతు బంధనాసనం

  • సేతుబంధనాసనం వేసుకుందుకు.. ముందుగా ఓ చోట వెల్లకిలా పడుకోవాలి.
  • చేతులను నేలకు తాకేలా ఉంచాలి. ఆ తర్వాత శ్వాస గాఢంగా తీసుకొని మోకాళ్లను వంచి.. మీ ఛాతి, నడుమును పైకి లేపాలి.
  • ఈ భంగిమలో 10 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత శ్వాస వదలాలి. ఈ భంగిమలో శరీరంలో ఓ వంతెనలా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్రిడ్జ్ పోజ్ అని అంటారు.

సేతు బంధనాసనం
సేతు బంధనాసనం (Pexels)

భుజంగాసనం

  • ఈ ఆసనం వేసేందుకు ముందుగా, ఓ చోట బోర్లా పడుకోవాలి.
  • ఆ తర్వాత మోచేతులను మడిచి.. అరచేతులను ఛాతి వద్దకు తీసుకురావాలి.
  • ఆ తర్వాత శ్వాస తీసుకొని అరచేతులపై భారం వేస్తే శరీర ముందు భాగాన్ని వైకి లేపాలి. ఆ తర్వాత శ్వాస వదిలి కిందికి దిగాలి. దీన్ని కోబ్రా పోజ్ అంటారు.

ఈ మూడు ఆసనాలు వేయడం వల్ల ఛాతి, భుజాలు, పొత్తి కడుపు కండరాలకు సాగినట్టుగా అవుతుంది. దీనివల్ల ఊరిపితిత్తుల సామర్థ్యం, పని తీరు మెరుగుపడుతుంది. అందుకే ఆస్తమా ఉన్న వారు రెగ్యులర్‌గా ఈ యోగాసనాలు చేయవచ్చు. ఈ ఆసనాల వల్ల గుండెకు మేలు జరుగుతుంది. నడుము నొప్పి, మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఉపకరిస్తాయి.

భుజంగాసనం
భుజంగాసనం (Pexels )
Whats_app_banner