కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే మీ ఆహారం ఈ ఐదు పదార్థాలు చేర్చండి. మీ శరీరంలో నొప్పిని తగ్గించడానికి గుండె జబ్బులు, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేందుకు ఈ ఆహారాలు ఉపయోగపడతాయి.  

pexels

By Bandaru Satyaprasad
Mar 09, 2024

Hindustan Times
Telugu

మీరు తప్పకుండా తినాల్సిన 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇవే  

pexels

బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాష్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్‌లో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థకు పటిష్టం చేస్తుంది.   

pexels

ఫ్యాటీ ఫిష్- సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పి, వాపును తగ్గిస్తాయి. ఒమేగా-3లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించే ముఖ్యమైన కొవ్వులు. 

pexels

ఆకు కూరలు - కాలే, స్పినాచ్, స్విస్ చార్డ్, కొల్లార్డ్ ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ K , క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి శరరం కండరాల, కీళ్ల వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి. 

pexels

 పసుపు - కుర్కుమిన్, పసుపులో క్రియాశీల సమ్మేళనం. ఇది శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తుంది. ఆర్థరైటిస్,  ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

pexels

బ్రోకలీ 

pexels

బ్రోకలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బోన్ హెల్త్ కు తోడ్పడే విటమిన్ K ను శరీరానికి పుష్కలంగా అందిస్తుంది.    

pexels

వేసవిలో దాహార్తిని తీర్చే నన్నారి షర్బత్ గురించి తెలుసా..?

image credit to unsplash